గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో జగనన్న హరిత వనాల్లో భాగంగా పచ్చదనం పెంపుకు ప్రత్యేక కార్యాచరణ సిద్డం చేశామని, వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తారని నగర కమీషనరు కీర్తి చేకూరి, ఐ.ఏ.యస్. తెలిపారు. శుక్రవారం కమిషనరు తమ చాంబర్ లో ఏ.పి. అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పోరేషన్ అధికారులు, కాంట్రాక్టర్లు, నగరపాలక సంస్థ ఎస్.ఈ., ఏడి.హెచ్.లతో నగరంలో చేపట్టే పనుల పై ప్రత్యేక సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో పచ్చదనం పెంపు ద్వారా స్వచ్చమైన వాతావరణాన్ని నగర ప్రజలకు అందించవచ్చన్నారు. జగన్నన హరిత వనాల్లో భాగంగా నగరంలో సెంట్రల్ మీడియన్స్, ప్రధాన రోడ్లకు ఇరువైపులా, ట్రాఫిక్ ఐలాండ్ ల్లో ప్రత్యేకంగా గ్రీనరి పెంపుకు ఏ.పి. గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పోరేషన్ ద్వారా టెండర్స్ పిలవడం జరిగిందని, టెండర్స్ ప్రక్రియ పూర్తి అయి, కాంట్రాక్టర్ లు కూడా ఫైనల్ అయ్యారన్నారు. రానున్న వారం రోజుల్లో పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్ లను ఆదేశించామన్నారు. పనుల పురోగతి వేగంగా ఉండాలని, పనులను నేరుగా ఏ.పి. గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పోరేషన్ అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. పనుల వేగావంతనికి నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ మరియు పార్క్స్ విభాగ అధికారులు తోడ్పాటుని అందిస్తారని తెలిపారు.
సమావేశంలో ఏ.పి అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పోరేషన్ జోనల్ మేనేజర్ చంద్ర శేఖర్, ఆర్కిటెక్ సత్యనారాయణ, నగరపాలక సంస్థ ఎస్.ఈ. పి.వి.కె.భాస్కర్, ఏ.డి.హెచ్. రామారావు, డి.ఈ.ఈ. మహ్మద్ రఫిక్, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News