విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, మనం సంపూర్ణ ఆరోగ్యం గా వుండాలి అంటే ప్రకృతిని కాపాడుకోవాలని అందుకే పర్యావరణనికి హాని కలిగించే ప్లాస్టిక్ బ్యానర్లను నిషేధిస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొన్న నిర్ణయానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సోమవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడ ఏ1 కన్వెన్షన్ లో జరిగే కార్యక్రమానికి హాజరవుతున్న జగన్ కి స్వాగతం పలుకుతూ వైస్సార్సీపీ నాయకులు భారీ ఎత్తున క్లాత్ బ్యానర్లను ఏర్పాటు చేయడం శుభపరిణామం అని అవినాష్ అన్నారు.
Prajavartha Online Telugu News