Breaking News

ఘనంగా శ్రీ నక్కా రాములు కోటేశ్వరమ్మ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ పంచమ వార్షికోత్సవం…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
శ్రీ నక్కా రాములు కోటేశ్వరమ్మ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ పంచమ వార్షికోత్సవం మహోత్సవం విజయవాడ, గాంధీనగర్‌లోని శారదా కళాశాల నందు ఆదివారం ఘనంగా జరిగింది. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ  అని నిరంతరం చాటి చెప్పే శీ నక్కా రాములు కోటేశ్వరమ్మ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు నక్కా వీరభద్రరావు, రాజ్యలక్ష్మి దంపతులు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కే.జీ.వి.సరిత, ఎస్పీ ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌, జి.కోటేశ్వరావు న్యాయవాది మాజీ కార్పొరేటర్‌, కుందా సీతారామశాస్త్రి ఆడిటర్‌, కళాశాల సెక్రటరీ Ê కరస్పాండెంట్‌, డాక్టర్‌ కె.దుర్గాక్షితిష్‌ ఎండిఎస్‌ హాజరయ్యారు. న్యాయవాది కోటేశ్వరరావు మాట్లాడుతూ ఈనాటి బాలికలే రేపటి తరం గొప్ప వ్యక్తులు అవ్వాలని అలానే చదువే మనిషికి సంస్కారం నేర్పుతోందని ప్రతి ఒక్కరూ చదువుని అశ్రద్ధ చేయక మంచిగా ఎదగాలన్నారు. ఎస్పీ ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ కే.జీ.వి.సరిత మాట్లాడుతూ తన అనుభవాలతో, కొన్ని సూచనలతో పిల్లలకి మంచిగా అవగాహన కల్పించారు. ఆడిటర్‌ కుందా సీతారామశాస్త్రి మాట్లాడుతూ మీరు కూడా అభివృద్ధి పథంలోకి వెళ్లి వీరభద్రరావు లాగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలన్నారు. డాక్టర్‌ కె.దుర్గాక్షితిష్‌ మాట్లాడుతూ నేటి తరం నిరంతరం శ్రమిస్తూ ఒక బాధ్యతాయుతంగా సంఘంలో ఉండాలని అలాగే విద్యార్థులు చెడు వ్యసనాలకు వైపు మళ్లకుండా మంచిగా అభివృద్ధిపథంలో నడవాలన్నారు. ట్రస్ట్‌ వ్యవస్థాపకులు నక్కా వీరభద్ర మాట్లాడుతూ ఈరోజు ముఖ్య అతిధులుగా విచ్చేసిన వారికి ఉన్న అతి కొద్ది సమయంలో మనలను ఉద్దేశించి మాట్లాడటానికి వచ్చారు కనుక మనం చాలా డిసిప్లేన్‌గా వుండి అలాగే వారు చెప్పే విషయాన్ని అవగాహన చేసుకుని మంచి మార్గంలో పయనించాలన్నారు. కొంతమంది అయినా వారి యొక్క స్ఫూర్తిని గ్రహించి పదిమంది మారినా ఈ సభా కార్యక్రమం నిర్వహించినందుకు ఫలితం ఉంటుందన్నారు. అలాగే 400 మందికి బాల బాలికలకు పుస్తకాలు, పెన్నులు మరియు వంద మందికి విద్యార్దులకు డ్రస్సులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్‌ సభ్యులు, వివిధ స్కూల్స్‌, కాలేజీల నుండి విద్యార్ధినీ, విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *