Breaking News

ప్రతి గడపపై జగనన్న సంక్షేమ ముద్ర : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-62వ డివిజన్ 269 వ వార్డు సచివాలయ పరిధిలో నాలుగో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
మూడేళ్ల పాలనలో రాష్ట్రంలోని ప్రతీ గడపపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనదైన సంక్షేమ ముద్ర వేశారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. బుధవారం 62 వ డివిజన్ 269 వ వార్డు సచివాలయ పరిధిలో స్థానిక కార్పొరేటర్ అలంపూర్ విజయలక్ష్మితో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. తొలుత ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో మొక్కలు నాటి పాదయాత్ర ప్రారంభించారు. ప్రకాష్ నగర్ లో విస్తృతంగా పర్యటించి.. 410 గడపలను సందర్శించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకునే కొత్త ఒరవడికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని మల్లాది విష్ణు తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలను ఎలా కత్తిరించాలా అనే ఆలోచన చేస్తే.. జగనన్న ప్రభుత్వం అర్హులను వెతికి మరీ లబ్ధి చేకూర్చుతోందన్నారు. సంక్షేమ పథకం అందని కుటుంబం సచివాలయ పరిధిలో ఒక్కటి కూడా లేకపోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పర్యటనలో భాగంగా పలు వీధులలో క్రిందికి వ్రేలాడుతున్న విద్యుత్ తీగలను గమనించిన ఆయన వెంటనే వాటన్నింటినీ పైకి మార్చాలని సిబ్బందిని ఆదేశించారు. లోతట్టు వీధులలో నీరు నిలిచిపోకుండా ప్రణాళికలు సిద్ధం చేయవలసిందిగా ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అలాగే పగుళ్లిచ్చిన మ్యాన్ హోల్స్ మూతలను తక్షణమే మార్చి కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు.

అవ్వాతాతల కంటికి వెలుగు
కంటి చూపు మందగించిన గడ్డం కుటుంబరావు అనే వ్యక్తికి వైఎస్సార్ కంటి వెలుగు పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కళ్ల పరీక్షలు నిర్వహించడమే కాకుండా కళ్లద్దాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జగనన్న ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడకూడదన్నదే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. కనుకనే మేనిఫెస్టోలో చెప్పకపోయినప్పటికీ డాక్టర్‌ వైఎస్సార్‌ కంటి వెలుగు పథకాన్ని అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే అమలు చేయడం జరిగిందన్నారు. ఈ పథకం కింద ఒక్క రూపాయి ఖర్చు చేయకుండానే పూర్తి ఉచితంగా కంటి పరీక్షలతో పాటు అవసరమైన చికిత్సలు, కళ్ల జోళ్లను అందించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో వారానికి సుమారు ఆరువేల మందికి ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఏడాది చివరి కల్లా రాష్ట్రంలోని వృద్ధులందరి కంటిచూపు సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యంతో వైద్య, ఆరోగ్యశాఖ చురుగ్గా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

విష ప్రచారం మీద ఆధారపడి ప్రతిపక్షాల రాజకీయాలు
ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి అనే నినాదంతో.. విజయవాడ నగరం ప్రగతి పథంలో దూసుకువెళ్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. అదే చంద్రబాబు హయాంలో నగర అభివృద్ధికి కేటాయించిన నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. కానీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిధులను సక్రమంగా వినియోగించి.. ప్రజలకు అన్నీ రకాల మౌలిక సదుపాయాలను కలిస్తున్నట్లు వివరించారు. అధికారాన్ని అనుభవించిన ఐదేళ్లు ప్రజలకు ఏం కావాలో కనీసం గ్రహించలేని నాయకులు గత టీడీపీ ప్రభుత్వంలో ఉండటం దౌర్భాగ్యమని మల్లాది విష్ణు పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిన అభివృద్ధి పనులను.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత శరవేగంగా జరిగేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. మరోవైపు చేతుల్లో జెండాలు తప్పితే ప్రజల కోసం స్పష్టమైన అజెండా లేని పరిస్థితుల్లో రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఉన్నాయని మల్లాది విష్ణు విమర్శించారు. 2014-19 మధ్య ఐదేళ్ల పాటు అధికారాన్ని పంచుకున్న టీడీపీ, బీజేపీ, జనసేన.. ఆంధ్రరాష్ట్రానికి తీరని ద్రోహం చేశాయని ఆరోపించారు. అటువంటి రాజకీయ పక్షాలు సిగ్గులేకుండా మరలా ఏ ముఖం పెట్టుకుని మరొకసారి అవకాశం అడుగుతాయని ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ధాటికి తట్టుకోలేక త్వరలోనే రాష్ట్రంలోని ప్రతిపక్షాలన్నీ అంతర్థానం అవడం ఖాయమని మల్లాది విష్ణు అన్నారు.

మీ అనురాగానికి, ఆప్యాయతకు కృతజ్ఞుడిని
సుధీర్ఘంగా సాగిన డివిజన్ పర్యటనలో ప్రజలు చూపిన ప్రేమానురాగాలు మరువలేనివని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఇప్పటివరకు 37 వార్డు సచివాలయాల పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం దిగ్విజయంగా పూర్తిచేసుకున్నామని.. ప్రత్యేకించి 62వ డివిజన్ ప్రజలు చూపిన ఆదరాభిమానాలకుగానూ ప్రతిఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, జోనల్ కమిషనర్(ఇంఛార్జి) అంబేద్కర్, డీఈలు గురునాథం, రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, వైసీపీ నాయకులు అలంపూర్ విజయ్, రామిరెడ్డి, వీరంకి నాగేశ్వరరావు, బోరా బుజ్జి, హైమావతి, సావిత్రి, గ్రేసీ, జనార్థన్, వెంకట్, శ్రీను, సాంబయ్య, భోగాది మురళి, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *