ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజా వార్త :
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానం ఇంద్రకీలాద్రిపై మహామండపము 6వ ఫ్లోర్ నందు ఆలయ సిబ్బందితో సామాజిక దూరం, ఇతర కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ బుధవారం హుండీ లెక్కింపును నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ, పాలకమండలి సభ్యులు, దేవాదాయ శాఖ సిబ్బంది, ఎస్పీఎఫ్ సిబ్బంది పర్యవేక్షించారు. మొత్తం హుండీలు 45, లెక్కించిన హుండీలు : 40 హుండీల్లోని కానుకలను లెక్కించగా 14 రోజులకు నగదు: రూ.1,85,55,426/- లు, సగటు ఆదాయం 1 రోజుకు రూ.13.25 లక్షలు చొప్పున హుండీ ఆదాయం వచ్చినది. హుండీల ద్వారా వచ్చిన బంగారం 488 గ్రాములు, 4 కేజీల 215 గ్రాములు వెండి వస్తువులను భక్తులు కానుకల రూపంలో అమ్మవారికి సమర్పించారు. ఈ-హుండీ (www.aptemples.ap.gov.in ద్వారా online నందు) ఆదాయం : రూ. 75,601/- లు చేకూరినది.
Prajavartha Online Telugu News