విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
33వ సౌత్ జోన్ నేషనల్ జూనియర్ అథ్లెటిక్ చాంపియన్ షిప్ ముగింపు కార్యక్రమంలో ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.యస్. పాల్గొని విజేతలకు బహుమతులు ప్రధానం చేసారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ లో ది.09.09.2022 తేదీ నుండి ది. 11.09.2022 వరకు 33వ సౌత్ జోన్ నేషనల్ జూనియర్ అథ్లెటిక్ చాంపియన్ షిప్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటిలకు సౌత్ జోన్ లోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటకా, పాండిచేరి, తమిళనాడు, మరియు లక్ష్య ద్వీప్ రాష్ట్రాల నుండి నాలుగు విభాగాల నుండి 155 ఈవెంట్లలో అథ్లెటిక్ లు పాల్గొన్నారు. ఆదివారం నిర్వహించిన 33వ సౌత్ జోన్ నేషనల్ జూనియర్ అథ్లెటిక్ చాంపియన్ షిప్ ముగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.యస్. పాల్గొన్నారు. ఈ ముగింపు కార్యక్రమంలో ఈ 155 ఈవెంట్లలో గెలుపొందిన 465 మందికి ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.యస్. చేతులమీదుగా పతకాలను ప్రధానం చేయడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ ప్రతిభ కనపరిచిన అథ్లెటిక్ లకు ఇండియన్ ఆయిల్స్ వారి తరుపున ప్రతి ఒక్కరికి 10 వేల రూపాయల నగదు బహుమతి ఇస్తున్నట్లు ఇండియన్ ఆయిల్స్ అధికారులు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో నాగార్జునా యునివర్సిటీ అధికారులు, ఇండియన్ ఆయిల్స్ అధికారులు మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News