-విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం లో అరబ్ దేశాల నుంచి వస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి స్మగ్లింగ్ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న రెవిన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
ఒక మహిళా ప్రయాణికురాలి ద్వారా అరబ్ దేశాల నుంచి భారత్‌లోకి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు నిఘావర్గాలకు నిర్ధిష్ట సమాచారం అందింది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 08.09.2022 సాయంత్రం స్మగ్లింగ్ బంగారాన్ని పట్టుకున్నారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం విజయవాడలో దిగిన వెంటనే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ నిఘా వర్గాలు ఆ ప్రయాణీకురాలి వద్ద నుంచి 980 గ్రాముల బరువున్న గాజులు, గొలుసుల రూపంలో ఉన్న బంగారాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్ సరకు విలువ సుమారు రూ. 50,95,600లు. కస్టమ్స్ చట్టం ప్రకారం, స్మగ్లింగ్ వస్తువుల విలువ రూ. 50 లక్షలపైన ఉన్నపక్షంలో అరెస్టుకు అవకాశముంటుంది. దీంతో ఆ ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను బట్టి నేరం బెయిలబుల్ నేరాల కేటగిరీ కిందకు వస్తుంది కాబట్టి ప్రయాణికురాలిని బెయిల్ పై విడుదల చేశారు. తదుపరి విచారణ పురోగతిలో ఉంది.
Prajavartha Online Telugu News