-కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజా వార్త :
జిల్లాలో ఐదు స్టాక్ యార్డ్ పరిధిలో 2,08,782 మెట్రిక్ టన్నుల ఇసుక నిలవ ఉందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ డా కే. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో సాండ్ రీచ్ లలో అందుబాటులో ఉన్న ఇసుకను ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలకు అందజేయడం లో ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఈరోజు జరిగిన సమావేశంలో కొత్తగా వచ్చిన బోట్స్ మెన్ సొసైటీస్ కి రాంప్ కేటాయింపులు లో 10 ప్రతిపాదనలకు ఆరింటికి సమావేశంలో సానుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ తెలియచేశారు. కోటిలింగాల 1, 3 రీచ్ లకు, గాయత్రి -1, 5 రీచ్ లకు సంబంధించి పెండింగ్ లో పెట్టవలసినదిగా కమిటీ లో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వెంకటనగరం కి సంబంధించి అనుమతించిన రీచ్ లకు బేసిక్ వ్యాల్యూ ప్రకారం ధరను నిర్ణయించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆ మొత్తం ఆర్డీవో వద్ద డిపాజిట్ చెయ్యాలని స్పష్టం చేశారు. సమావేశంలో భాగంగా జిల్లాలో 12 డీ సిల్టింగ్ పాయింట్స్ గుర్తింపు లో భాగంగా జాయింట్ ఇన్స్పెక్షన్ పై ఆర్డీవో నివేదిక ను ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు కోసం వారికి దగ్గరలో ఉన్న రీచ్ ల నుంచి మాత్రమే ఇసుక కేటాయింపులు జరగాలన్నారు. గృహ నిర్మాణాలకు , ఇతర నిర్మాణ లకు విక్రయించే ధరల వివరాలు ప్రముఖంగా ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ విషయంలో ఫిర్యాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపెక్షించడం జరగదని కలెక్టర్ తెలిపారు.
సమావేశంలో భాగంగా అధికారులు వివరాలు తెలుపుతూ వేమగిరి, కడియపు లంక లో రెండు రీచ్ ల్లో 84,440 మెట్రిక్ టన్నుల ఇసుక ఉన్నా, వరదలు మూలంగా సరఫరా నిలుపుదల చేశామన్నారు. ఈ ప్రాంతానికి చెందిన 44,100 మెట్రిక్ టన్నుల ఇసుక జెపి వారికి ఇవ్వడం జరిగిందన్నారు. కాతేరు లో 80,208 మెట్రిక్ టన్నులు ఇసుక ఉన్నట్లు తెలిపారు . వంగలపుడి, కాటవరం కి సంబంధించి పునర్ తనిఖీ కై ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, డిపివో పి జగదాంబ, అదనపు ఎస్పీ ,.ఎం & జి డిడి ఈ. నరసింహ రెడ్డి, ఎస్ ఈ (పిఆర్) .. ఏబివి ప్రసాద్, డి ఈ వో. ఎస్. అబ్రహం, ఎస్ ఈ (ఆర్ డబ్ల్యూ ఎస్) డి. బాలశంకర్, హౌసింగ్ డి ఈ ఓ బి. తారా చంద్,
ఈ. జె పీ పవర్ వెంచర్ ప్రతినిధులు వంశీ, హరీష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News