విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ని సోమవారం వారి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి రాష్ట్రంలో విద్యార్థులు పడుతున్న పలు విద్యార్థి సమస్యలు పై వినతి పత్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర అధ్యక్షులు నాగమధు యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ లు అందజేసారు.
1. పాఠశాల విలీనానికి జారీ జీవో నెంబర్ 117ను రద్దు చేయాలి.
2. ప్రైవేట్ ,కార్పొరేట్ విద్యాసంస్థలలో అధిక ఫీజుల దోపిడిని అరికట్టి, విద్యా సంస్థలలో ఫీజుల బోర్డును ఏర్పాటు చేసేలా ప్రభుత్వం జీవో జారీ చేయాలి.
3. మోడల్ స్కూల్, కస్తూర్బా,గురుకుల, స్కూళ్లలో సీట్ల సంఖ్యను పెంచాలి.
4. ప్రభుత్వ పాఠశాలలో జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ , లెక్చలర్ పోస్టులన్నీ భర్తీ చేయాలి.
5. ఉపాధ్యాయ, పోలీస్ సచివాలయం, లో ఖాళీగా ఉన్న పోస్టులన్నిటికీ నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి.
6. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని వ్యతిరేకించాలి.
7. ప్రభుత్వ వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించి, విద్యార్థులకు మేస్ చార్జీలు పెంచాలి.
8. రాష్ట్ర వ్యాప్తంగా నాడు- నేడు పథకంలో జరిగిన అవినీతిక్రమలపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేయాలి.
9. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆకర్షణీయ కోర్సుల పేరుతో ఎటువంటి విద్యాశాఖ అనుమతులు లేకుండా అకాడమీ, కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి విద్యార్థుల తల్లిదండ్రులు వద్ద నుంచి లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నాయని అలాంటి విద్యా సంస్థల పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
Prajavartha Online Telugu News