విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ,కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో దేవుడు అయ్యాడని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు.గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 19వ డివిజన్ 85వ సచివాలయం పరిధిలో పర్యటించిన అవినాష్ ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ జనాలలో రోజురోజుకు ప్రభుత్వనికి పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఇక తమ పార్టీకి మనుగడ ఉండదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కి ఆందోళన మొదలైంది అని అందుకే వాళ్ళ నాయకులను రెచ్చగొట్టి కవ్వింపు చర్యలకు పాల్పడమని ప్రోత్సహిస్తున్నారని, ఆయన మెప్పు కోసం కిందస్థాయి నాయకులు ఆరాటంలో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడ్తున్నారని విమర్శించారు. మిరెన్ని ప్రగల్భాలు పలికిన తొడలు కొట్టుకొన్న ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఇక తెలుగుదేశం పార్టీ ఖతం అని అవినాష్ ఎద్దేవా చేశారు. ఈ ప్రాంతంలో రజకులకు ఉపయోగపడేలా వారి కోరిక మేరకు 10లక్షల రూపాయల నిధులు ఖర్చు చేసి కేవలం రెండు నెలల కాలంలో షేడ్స్ నిర్మించి నిన్న కలెక్టర్ గారితో ప్రారంభోత్సవం చెపిస్తే, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వచ్చి ఆయన అసమర్థత, చేతకానితనం కప్పిపుచ్చుకునేందుకు అసత్యాలు మాట్లాడటం సిగ్గుచేటు అని అన్నారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్ళ కాలంలోనే మెనిఫెస్టో లో చెప్పిన 98 శాతం హామీలు అమలు చేసి,అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేసామని గర్వంగా చెప్పగలం అని ఆవినాష్ ధీమా వ్యక్తంచేశారు. ఇచ్చిన మాట ప్రకారం వీలైనంత త్వరగా షాధి ఖాన నిర్మాణం కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 19వ డివిజన్ కార్పొరేటర్ రహేన నాహిద్,కో ఆప్షన్ మెంబెర్ సయ్యద్ అలీమ్, వైస్సార్సీపీ నాయకులు నహీద్,షేక్ సుభాని, రంగ, సలాం, జగ్జీవన్ రావ్, చింతగుంట విజయ్, రత్నకుమారి, అనిత, భత్తులు నాగేశ్వరరావు, జావిద్ పటాన్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News