Breaking News

బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో 70 మంది ఇంజనీర్లకు సత్కారం…


విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి రోజైన ఇంజినీర్స్ డేను పురస్కరించుకొని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో 70 మంది ఇంజనీర్లను సత్కరించి జ్ఞాపికలు అందజేయడం జరిగింది. గురువారం విజయవాడలోని ఓ ప్రైవేట్ కన్వెన్షషన్ హాళ్లలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రిన్సిపాల్ సెక్రటరీ గవర్నమెంట్ హెల్త్ మెడికల్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కమిషనర్ ఎం.టి.కృష్ణబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా అయన   మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఇంజనీరింగ్ రంగంలో తన సత్తా చాటిన ఉత్తమ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని వారు పేర్కోన్నారు. సాంకేతికంగా పురోగమించని రోజుల్లో కూడా అద్భుతమైన పరిజ్ఞానాన్ని వినియోగించి ఎన్నో నిర్మాణాలను రూపొందించారని తెలిపారు. ఇంజనీరింగ్ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా విశ్వేశ్వరయ్య సేవలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇంజనీర్లను గుర్తించుకొని వారిని సత్కరించడం చాలా అభినందనీయమని, సత్కరించిన ఇంజనీర్లను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బండ్రెడ్డి రాఘవయ్య, ఆంధ్రప్రదేశ్ స్టేట్ చైర్మన్ బి రాఘవరావు, ఆర్గనైజేషన్ కమిటీ ప్రతినిధులు చెరువు రామకోటయ్య, నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *