విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష’ విజయవాడ నగరపాలక సంస్థ నందు గల 242 మరియు 243 సచివాలయములను పైలట్ ప్రాజెక్ట్ క్రింద సెలక్ట్ చేసినందున కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీ ప్రవీణ్ కుమార్(CDMA), స్పెషల్ ఆఫీసర్ రీ సర్వే ప్రాజెక్ట్ బి. సుబ్బారావు తనిఖీ నిర్వహించినారు. అదే విధంగా కమిషనర్ (CDMA) రీ సర్వేలో అన్ని దశలను చాలా విపులంగా అధికారులకు వివరించారు. రెవెన్యూ మరియు సర్వే డిపార్ట్మెంట్ లతో కోఆర్డినేషన్‌తో వ్యవహరిస్తూ రీ సర్వే కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. సర్వేలో భవనాలు, రోడ్లు, చెరువులు, కాలువలు, ఖాళీ స్థలాలు.. ఇలా వేటికవి ప్రత్యేకంగా గుర్తిస్తారని తెలిపారు. ఇకపై ఏ సమస్యలు లేకుండా ఎవరి ఆస్తిపై వారికి అన్ని వివరాలతో కూడిన హక్కు పత్రం ఇచ్చేందుకు పైలట్ ప్రాజెక్ట్ ఈ ప్రక్రియ చేపట్టుతుoదని తెలిపారు. గత శతాబ్ధం క్రితం ఇంత అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానం అప్పుడు లేదని, ఇప్పడు సాంతకేతికను ఉపయోగించి రీసర్వే నిర్వహిస్తున్నామన్నారు. ఇకపై ఈ సర్వే ప్రక్రియ అమలుపై పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా డ్రోన్ ఉపయోగించి ఆస్తుల కొలతలు తీసుకోవడం, రికార్డుల ప్రకారం రోడ్లు, చెరువులు, ప్రభుత్వ ఆస్తుల గుర్తింపు, ఆయా సర్వే నంబర్లుపై తర్ఫీదునిస్తారని తెలిపారు. ప్రతి రికార్డును డిజిటలైజేషన్ చేస్తామన్నారు. సమావేశంలో సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ బాలాజీ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News