-నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
గురువారం కమిషనర్ అధికారులతో కలసి అజిత్ సింగ్ నగర్, లూనా సెంటర్, 242 మరియు 243 వార్డ్ సచివలయాలను తనిఖి చేసారు. సచివాలయం సిబ్బంది యొక్క పని తీరును మరియు వారి వద్దన గల పలు రిజిస్టర్ లను పరిశీలించి పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకములపై ప్రజలకు పూర్తి అవగాహన కలిపించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. దీనికి సచివాలయం నందలి డిస్ ప్లే బోర్డు నందు పథకముల వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. సచివాలయ ఉద్యోగుల హాజరు శాతం, సచివాలయానికి వచ్చే ప్రజల సమస్యలపై వచ్చే దరఖాస్తులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు దగ్గరగా ఉంటూ మెరుగైన సేవలు అందించడంతో పాటు సచివాలయానికి వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరం చూపాలని, విధి నిర్వహణలో ఉన్న సచివాలయ సిబ్బంది భాద్యతాయుతంగా తమ విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలను అందించేలా చూడాలని, విధి నిర్వహణలో అలసత్వం వహించు సిబ్బందిపై చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. పర్యటనలో సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News