Breaking News

స్వచ్ఛ్ భారత్ మిషన్-2.0 ‘చెత్త రహిత నగరం’గా తిర్చిదిద్దలి…

-నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలో రెండు చోట్ల ‘ఇండియన్ స్వచ్ఛతా లీగ్’ పోగ్రామ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
స్వచ్చ్ అమృత్ మహోత్సవ్ కార్యక్రమములో భాగంగా శనివారం ‘ఇండియన్ స్వచ్ఛతా లీగ్’ ర్యాలి ను నగరంలో రెండు చోట్ల, భవాని ఐలాండ్ (పున్నమి ఘాట్) మరియు వారధి ప్రక్కన 18 వ డివిజన్ సిమెంట్ గౌడన్ నందు జిల్లా కలెక్టర్  ఢిల్లీ రావు, ఐ.ఏ.ఎస్, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు  వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఫ్లోర్ లీడర్  వెంకట సత్యనారాయణ మరియు కార్పొరేటర్లు అందరితో కలిసి జెండా ఉపి కార్యక్రమమును ప్రారంభించినారు.

స్వచ్చ్ అమృత్ మహోత్సవ్ కార్యక్రమములో భాగంగా ‘ఇండియన్ స్వచ్ఛతా లీగ్ కార్యక్రమమును నగరపాలక సంస్థ అద్వర్యంలో నిర్వహించిన పారిశుద్ద్య పరిశుభ్రత, మొక్కలను నాటడం, వాల్ పెయింటింగ్, పోగ్రామ్ లో జిల్లా కలెక్టర్  ఢిల్లీ రావు, ఐ.ఏ.ఎస్, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఫ్లోర్ లీడర్  వెంకట సత్యనారాయణ మరియు కార్పొరేటర్లు అందరితో కలిసి పాల్గొన్నారు. ఈ పోగ్రామ్ లో పాల్కొన్న కాలేజి విద్యార్ధులకు నిర్వహించిన వాల్ పెయింటింగ్ సాంస్కృతిక నాట్యలు, వ్యాస రచన, క్విజ్ తదితర పోటిలలో విజేతలకు ప్రసంశా పత్రములు అందజేసారు.

పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతదేశంలోనే స్వచ్ఛతా లీగ్ లో ఒకటిగా విజయవాడ నగరం నిలిచిందని, నగర ప్రజల సహాయ సహకారాలతోనే ఇది సాధ్యమైందని అన్నారు.

జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, ఐ.ఏ.ఎస్ మాట్లాడుతూ పారిశుద్ద్యం, నగర పచ్చదనం, పరిశుభ్రత వంటి బృహత్తర కార్యక్రమలపై అవగాహనా కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు.

నగర మేయర్  రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ స్వచ్ఛతా లీగ్ లో భాగంగా అధికారులు, సిబ్బంది కృషి, యువత మరియు నగర ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైందని అన్నారు. స్వచ్చ్ సర్వేక్షణ్ నందు జాతీయ స్థాయిలో మన నగరం 3వ స్థానములో ఉండుట మనకు ఎంతో గర్వకారణమని అన్నారు. రాబోవు రోజులలో ఇదే స్పూర్తితో మొదటి స్థానం సాధించే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయవలసిన ఆవశ్యకత మనందరిపై ఉందని అన్నారు. అతి చిన్న నగరం అయినప్పటికీ మనం చేపట్టిన సంస్కరణ వల్ల మిగిలిన రాష్ట్రాలతో పోటి పడి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందుట జరిగిందని, దానిని నిలుపుకొనుట మనందరి ప్రధమ కర్తవ్యం గా భావించి నేడు చేపట్టిన స్వచ్ఛతా లీగ్ లో మీరందరూ భాగస్వాములై మీ ద్వారా మీ కుటుంబ సభ్యులు మరియు తోటి స్నేహితులు మరియు చుట్టూ ప్రక్కల నివాసాల వారికీ ప్లాస్టిక్ వాడకం వల్ల కలుగు అనర్ధములు వివరించి వారిలో చైత్యనం నింపి పూర్తి స్థాయిలో సింగల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణను ప్రజలందరూ విధిగా అమలు చేసే విధంగా చూడాలని అన్నారు.

అదే విధంగా కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌. మాట్లాడుతూ స్వచ్ఛ్ భారత్ మిషన్ – అర్బన్ ఎనిమిదేళ్లను పురస్కరించుకుని, 17 సెప్టెంబర్ 2022 వ తేదీ నుంచి 2 అక్టోబర్ 2022 వ తేదీ వరకు స్వచ్ఛత దివాస్. ‘చెత్త రహిత నగరాలు’ నిర్మించాలనే దృక్పథం పట్ల పౌరుల చర్య మరియు నిబద్ధతను సమీకరించడం పై 15 రోజులు నిర్వహించడం జరుగుతుంది. యువకులు చాలా ఉత్సాహాన్ని మరియు ఆసక్తిగా వచ్చి పాల్గొనాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సింగల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్త్పతులను నిషేధించాలని అన్నారు. ముందుగా మనం పాటిస్తూ, ప్రజలకు అవగాహన కల్పించాలనే ప్రధాన ఉద్దేశ్యంతో నేడు ఈ కార్యక్రమము చేపట్టినట్లు అన్నారు.

అందరికి తెలిసిన విషయం మన నగరం జాతీయ స్థాయిలో స్వచ్చ్ సర్వేక్షణ్ నందు 3వ స్థానంలో ఉన్నాం, ఆ స్థానాన్ని నిలపెట్టుకోవలననిన లేదా మొదటి లేదా రెండోవ స్థానం కైవసం చేసుకోవాలన ప్రతి ఒక్కరం భాద్యతగా సింగల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం నిషేదించి వాటికీ బదులుగా జ్యూట్, క్లాత్ వంటి సంచుల వాడకం మరియు మన ఇంటి, నగర పరిసరాలు అన్నియు పరిశుభ్రంగా ఉంచుకోవటం వంటి అంశాలను విధిగా పాటించి నగరంలో పర్యావరణాన్ని కాపాడుటలో ప్రతి ఒక్కరు పూర్తి భాద్యత చేపట్టాలని అన్నారు. దీని ద్వారా ప్రజలలో కూడా చైత్యనం వస్తుందని పేర్కొన్నారు.

కార్యక్రమములో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, అదనపు కమిషనర్(జనరల్) యం.శ్యామల, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, డిప్యూటీ సిటి ప్లానర్ (ప్లానింగ్ ) జుబిన్ శిరన్ రాయ్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పి.రత్నావళి, ప్రాజెక్ట్ ఆఫీసర్ యు.సి.డి శకుంతల, ఏ.డి.హెచ్ శ్రీనివాసు, బయాలజీస్ట్ డా.బాబు శ్రీనివాసన్, మరియు ఇతర అధికారులు మరియు కార్పొరేటర్లు, విద్యార్ధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *