Breaking News

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి గా కోలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎంపిక

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తేనీటి విరామం తదుపరి మధ్యాహ్నం 12.00 గంటలకు సభ సమావేశమై న వెంటనే శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ఉపసభాపతి పదవికి  కోలగట్ల వీరభద్రస్వామి పేరు ఒక్కటే నామినేట్ చేయబడి నందున వారిని ఉపసభాపతి గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సభాపతి ప్రకటించారు. అనంతరం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాటు పలువురు మంత్రులు, శాసన సభ్యులు. కోలగట్ల వీరభద్ర స్వామిని పోడియం పైనున్న స్పీకర్ సీటు వద్దకు తీసుకువచ్చి గౌరవ ప్రదంగా వారిని ఆ సీట్లో కూర్చో బెట్టి అభినందనలు తెలియజేశారు. అనంతరం పలువురు మంత్రులతో పాటు అధికార, ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులు ఉపసభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి కి అభినందనలు తెలియజేశారు. అనంతరం పలువురు శాసనసభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి కున్న అనుభవాన్ని, ప్రజాసేవలో భాగంగా ప్రజలకు వారు చేసిన సేవలను కొనియాడుతూ ప్రసంగించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *