Breaking News

సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా జగనన్న పాలన : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  పరిపాలన అందిస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 19వ డివిజన్ లో పిచ్చయ్య రోడ్, మసీద్ రోడ్, కాపు కల్యాణ మండపం రోడ్ ప్రాంతాలలో పర్యటించిన అవినాష్ ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి అందుతున్న సంక్షేమ లబ్ధి కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాతనే అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు అవుతున్నాయని,గత తెలుగుదేశం ప్రభుత్వం లో అయితే అవ్వతతాలు ఓపిక లేకున్నా సరే కార్యాలయాల చుట్టూ తిరిగితే గాని పెన్షన్లు గాని, సంక్షేమ పథకాలు గాని అందే పరిస్థితి లేదని విమర్శించారు. ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ఆరోపణలను అభివృద్ధి తోనే ఎదుర్కొంటున్నామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ షో రాజకీయాల్లో ఆరితేరాడు అని, ప్రచార ఆర్భాటాలు తప్ప నియోజకవర్గ అభివృద్ధి పట్టదు అని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసిన రాబోయే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో ఎగిరేది వైసీపీ జెండానే అని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా జనరంజకంగా పరిపాలన అందిస్తుంటే చూసి ఓర్వలేక ప్రతిపక్ష టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు అని,రాబోయే 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉంటారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, 19వ డివిజన్ కార్పొరేటర్ రహేన నాహిద్, కో ఆప్షన్ మెంబెర్ అలీం,వైస్సార్సీపీ నాయకులు నహీద్,షేక్ సుభాని,జగ్జీవన్ రావ్, చింతగుంట విజయ్, పోతురాజు, బోసు , నాగ లత ప్రభుదాస్, సలీం, పిల్లి వెంకట్, రత్నకుమారి ,అనిత, రమ, భత్తులు నాగేశ్వరరావు, ముజాహిద్ గోపాల్, నిమ్మగడ్డ నాగిరెడ్డి, అఫ్సర్ అరుణ్ కుమార్, డేవిడ్, అబ్బాస్.బినియమిన్, రబ్బాని, అస్గర్ , ఏసుబాబు, ప్రతాప్, మౌలాలి , రామ్, జావిద్ పటాన్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *