Breaking News

సమన్వయం సాధించడం కోసం పనిచేయాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జ‌ల‌శ‌క్తి అభియాన్ నిర్దేశించిన ల‌క్ష్యం, జిల్లాలో నిర్దేశించుకున్న ల‌క్ష్యాలను చేరుకునేలా సమన్వయం సాధించడం కోసం పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా కే.మాధవీలత స్పష్టం చేశారు. సోమవారం స్థానిక కలెక్టర్ విడిది కార్యాలయంలో డ్వామా, వ్యవసాయ, హార్టికల్చర్, భూగర్భ జల, జలవనరుల, అటవీ, జిల్లా పంచాయతీ, మైక్రో ఇరిగేషన్, రూరల్ వాటర్ సరఫరా తదితర శాఖల అధికారులతో కేంద్ర జల శక్తి అభియాన్ నోడల్ అధికారి పర్యటన సందర్భంగా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె.మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది మార్చి 29 నుంచి నవంబర్ 13 వరకు జిల్లాస్థాయి అధికారుల‌తో క‌ల‌సి నీటి ఒత్తిడిని ఎదుర్కొనే దిశలో జిల్లాల‌లో నీటి సంర‌క్ష‌ణ‌, నీటివ‌న‌రుల నిర్వ‌హ‌ణ‌ వంటి వాటికి సంబంధించిన ఐదు ల‌క్ష్యాల సాధ‌న‌కు కృషి చేయ్యాడం జరుగుతోందన్నారు. ఇందులో నీటిని పొదుపు చేయ‌డం, వాన నీటి సంర‌క్ష‌ణ‌, సంప్ర‌దాయ, ఇత‌ర జ‌ల వ‌న‌రులు, చెరువుల‌ పున‌రుద్ధ‌ణ‌, బోరుబావుల‌ను రీచార్జి చేయ‌డం, వాట‌ర్‌షెడ్ అభివృద్ధి, పెద్ద ఎత్తున అడ‌వుల పెంప‌కం వంటి వాటిపై దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు. ఆ దిశలో జిల్లాలో ఇప్పటివరకు సాధించిన పురోగతి, రీ చార్జి అయినా వాటి సమగ్రం సమాచారం అందించాలని ఆదేశించారు. వాటి ప్రచారం ద్వారా పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల‌లో అవ‌గాహ‌న ఏర్ప‌డి, ప్ర‌జ‌లు నీటిని పొదుపు చేయ‌డం ప్రారంభించడంలో తప్పనిసరిగా భాగస్వామ్యం అవుతారని పేర్కొన్నారు. జ‌ల‌శ‌క్తి అభియాన్ ద్వారా మెరుగైన రీతిలో నీటి పొదుపు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర జల శక్తి అభియాన్ నోడల్ అధికారి ఎస్. ప్రవీణ్ ఆధ్వర్యంలోని బృందం జిల్లా క్షేత్ర స్థాయి పర్యటనలో రాష్ట్ర ప్ర‌భుత్వము ద్వారా  జెఎస్ఎ, సిటిఆర్ కింద జిల్లా, స్థానిక నిధుల‌తో చేప‌ట్టిన ప‌నుల వివ‌రాల‌ను పొందు ప‌ర‌చవ‌ల‌సిందిగా ఆదేశించారు. కేంద్ర నోడల్ అధికారి ఆధ్వర్యంలో బృందం సెప్టెంబర్ 21 , 22 తేదీల్లో రాజమహేంద్రవరం, అనపర్తి, బిక్కవోలు, రాజానగరం, రాజమహేంద్రవరం రూరల్, గోకవరం, నల్లజేర్ల మండలాల్లో పర్యటన కోసం రానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డ్వామా పిడి జీ. ఎస్.రామ్ గోపాల్, జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారి ఎస్. రామ్ మోహన్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బి. బాలశంకర్, డి హెచ్ వో వి. రాధాకృష్ణ, ఇరిగేషన్, అటవీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *