విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
వంగవీటి రాధా ఏ ఒక్క కులానికి చెందిన వ్యక్తి కాదని బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడే వ్యక్తి అని, ఆయన అడుగు జాడలలో కులాలకు అతీతంగా ఆంద్ర, తెలంగాణ రాధా- రంగ మిత్రమండలి ఛారిటబుల్ ట్రస్ట్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించామని కాలపలెం బుజ్జి తెలిపారు. గాంధీనగర్ లో ఆంద్ర, తెలంగాణ రాధ రంగ మిత్రమండలి ఛారిటబుల్ ట్రస్ట్ నూతన కార్యాలయాన్ని రాధా అనుచరులతో ప్రారంభించారు. ఈ సందర్భంగా బుజ్జి మాట్లాడుతూ వంగవీటి మోహాన రంగా ఆశయసాధనకు, రాధ రంగామిత్ర మండలి పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతోనే ఈ చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. వంగవీటి రంగా ఒక కులానికి చెందిన వ్యక్తి కాదని, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన తన ప్రాణాలు అర్పించారని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతంలోనైనా వంగవీటి మోహాన రంగా విగ్రహం పెట్టదలచిన వారు తమను సంప్రదిస్తే ఉచితంగా విగ్రహాలను అందిస్తామని వివరించారు. అలాగే ఆర్ధికంగా ఇబ్బందుకు పడుతున్న నిరుద్యోగ యువతకు తోడ్పాటు అందించడంతో పాటు వారికి ఉద్యోగ, ఉపాధి కల్పనకు కృషిచేస్తామని వెల్లడించారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయలకు, కులమతాలకు అతీతంగా రంగా అభిమానులున్నారని వారందరిని ఏకతాటిపైకి తేవడంతోపాటు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ట్రస్టు సభ్యులు స్పష్టం చేసారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి, చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పన్నాస పూర్ణచంద్రరావు, ప్రధాన కార్యదర్శి రొక్కం శివ, జిల్లా అధ్యక్షులు బండి రెడ్డి రవి, కమిటీ సభ్యులు తోట నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News