-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చి దిద్దేందుకు ప్రైవేట్ సంస్థలు సైతం కదలి వస్తున్నాయి. అందుకు నిదర్శనంగా మంగళవారం విజయవాడ కాళేశ్వర రావు మార్కెట్ వద్ద ఆక్సిస్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ పరిసరాల వ్యాపారులకు క్లాత్ బ్యాగ్ లను అందజేసి ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిలిపివేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొని షాపులకు క్లాత్ బ్యాగ్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ విజయవాడను ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చేందుకు ప్రజలందరూ తమ వంతు కృషి చేయాలని పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రైవేటు సంస్థలు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినందుకు హర్షన్ని వ్యక్తం చేశారు అలాగే మరెన్నో పర్యావరణ సంరక్షణ సంబంధిత కార్యక్రమాలను తలపెట్టి ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావడానికి అనేక సంస్థలు ముందుకు రావాలన్నారు. విజయవాడ నగర పాలక సంస్థ తరపున జరుగుతున్న స్వచ్ఛ విజయవాడ కార్యక్రమాలలో కూడా ప్రజలు ఉత్సాహంగా పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆక్సిస్ బ్యాంక్ ఉద్యోగులు, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News