Breaking News

1 టన్ను వరకు సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను వ్యాపారులు స్వచ్ఛందంగా అందజేత

-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ ఆదేశాల మేరకు సర్కిల్-1 నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద హోల్ సేల్ ప్లాస్టిక్ అసోసియేషన్ వారు మంగళవారం వారి దగ్గర మిగిలిపోయిన, గోడౌన్ లో వున్న సింగిల్ యుజ్ ప్లాస్టిక్ ను సుమారు (1 టన్ను) నగర మేయర్  రాయన భాగ్యలక్ష్మి కి స్వచ్ఛందంగా అందజేయడం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జూలై 1వ తారీకు నుండి సింగిల్ యుస్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడం జరిగింది. కాబట్టి వారి వద్ద మిగిలిపోయిన సింగిల్ యూస్ ప్లాస్టిక్ మొత్తాన్ని తిసుకువచ్చి జోనల్ కమిషనర్ కార్యాలయంలో అందజేయవలసిందిగా వ్యాపార సంఘాలను ప్రోత్సహించడం వల్ల ఈ రోజు దాదాపుగా 30 షాప్ ల నుంచి 1 టన్నవరకు సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను స్వచ్ఛందంగా వచ్చి నగర మేయర్ గారికి స్వచ్ఛందంగా అందజేయడం జరిగింది. అలాగే ఇకమీదట సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను వాడమని వ్యాపార వర్గాలు నగర పాలక సంస్థ కు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మేయర్  మాట్లాడుతూ ఇంకా ఎవరైనా సరే నగరం లో మిగిలిపోయిన సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను తీసుకువచ్చి స్వాధీనం చేయాలని లేదంటే ఎన్ఫోర్స్మెంట్ టీమ్ వారిని రైడింగ్ కు పంపించి పెద్ద మొత్తంలో అపరాధ రుసుము వసూలు చేయడంతో పాటు మొబైల్ కోర్టు నందు ఛార్జ్ షీట్ చేయబడతాయని హెచ్చరించారు. నగర పర్యావరణాన్ని కాపాడడానికి నగర ప్రజలు ,వర్తక సంఘాలు సహకరించి నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా వుంచడానికి కృషి చేయాలని తెలిపారు. స్వాధీనం చేసుకున్న ప్లాస్టిక్ ను కాల్చివెస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ACG శ్యామల గారు, ZC-1 సుధాకర్ గారూ, AMOH, SS -1, SI లు, శానిటేషన్ సెక్రెటరీలు పాల్గోన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *