Breaking News

“ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వాస్తవ చరిత్ర అక్టోబరు 7న ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సదస్సు”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రభుత్వ రంగం ప్రైవేటు రంగం వైపు మళ్ళి కొద్దిమంది ధనవంతుల చేతుల్లోకి వెళ్లి అడ్డు అదుపు లేకుండా కుల ఆధారిత వివక్ష పెరిగి బిసి ఎస్సి ఎస్టి మైనార్టీలైన అణగారిన ప్రజలు రాజ్యాంగం కల్పించిన హక్కులు పొందలేక పోతున్నారని ఐపిటియుసి రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి మహేష్ అన్నారు. గాంధీనగర్‌, ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఐపిటియుసి రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి మహేష్, ఐపిసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ జై బాబులు మాట్లాడుతూ ఐపిసి అణగారిన ప్రజల పార్టీగా రాజ్యాంగ బద్దంగా ముందుకు వెళుతుందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ఎమ్మెల్యే ఎంపీ స్థానాలకు పోటీ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 85 శాతం గా ఉన్న అణగారిన ప్రజల ఓట్లతో అగ్రవర్ణ పార్టీలను ఓడించే రాజకీయ యుద్ధం మొదలైందని అన్నారు. ప్రతి గ్రామంలో అణిచివేయ బడిన అల్పసంఖ్యాకులు ప్రయోజనాలను పొందలేకపోతున్నారని రాజ్యాంగం కల్పించిన వారి హక్కులను అడిగితే అగ్రకుల పాలకులు అధికారం పై దాడిగా చిత్రించి అక్రమ కేసులను బనాయిస్తున్నారని తెలిపారు దళిత గిరిజనుల పై దాడులు హత్యలు కేసులు పెరిగాయని 75 సంవత్సరాల నుండి అగ్రవర్ణ పార్టీలు మాతోనే సామాజిక న్యాయం సాధ్యమని నమ్మపలికించి మోసగించి ఓటు బ్యాంకు గానే వాడుకుంటున్నారని అందుకే ఐపిసి అణగారిన ప్రజల పార్టీగా ముందుకు వస్తుందని అన్నారు. అణగారిన ప్రజలంతా ఓటు వేసి బలపరచాలని కోరారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రభుత్వ రంగాలతో పాటు జనాభా ప్రాతిపదికన ప్రైవేటు రంగాలలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల ప్రాతినిధ్యం ఉండాలని ఇది రాజ్యంపై పెట్టిన రాజ్యాంగం కల్పించిన హక్కుని అన్నారు. వ్యవసాయ రంగం పరిశ్రమలు భూమి పెట్టుబడి కార్మికుల పని గంటలు వారి హక్కులు వ్యక్తి స్వేచ్ఛ విలువలు దిగజారిపోయాయని అన్నారు. రాష్ట్రంలో ఒకటి రెండు కులాలే 75 సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రణాళికలు బడ్జెట్ కేటాయింపులు వాళ్లు వాళ్ల కుల వృత్తుల కే ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నారే తప్ప మిగతా అణగారిన కులాల అభివృద్ధిని కాంక్షించలేదని ఇది ఆంధ్రప్రదేశ్ వాస్తవ చరిత్ర అని అన్నారు కద్దర్ కరెన్సీ రాజకీయాలు చేస్తూ అసమానతులను పెంచే రహదారిని వేశారని అన్నారు ప్రజాస్వామ్యాన్ని వ్యక్తి ఓటు విలువలను దిగజార్చే పాలన సాగుతుందని అధికారాన్ని అడ్డుపెట్టుకొని అణిచివేత కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని దీనిని మానుకోవాలని అన్నారు. రాష్ట్ర విభజన జరిగి 8 సంవత్సరాలు కావస్తున్న అమరావతి రాజధాని అభివృద్ధి ఆగిందని అన్నారు. ఒకటి రెండు మూడు కులాల రాజధానులు మాకు వద్దని అన్నారు అమరావతి చరిత్ర కలిగిన ప్రాంతమని దీనిలో కుల రాజకీయాలు వద్దని అన్నారు ఇది బుద్ధ బహుజన ప్రజల రాజధాని అని ఇందులో ఎంతోమంది త్యాగాలు ఉన్నాయని అన్నారు. ఒకటి రెండు కులాల అభివృద్దే రాష్ట్ర అభివృద్ధిగా వక్రీకరిస్తూ విభజన హామీలకు తూట్లు పొడిచారని అన్నారు. ఆంధ్ర ప్రజలను దగా మోసం కుట్రలకు బలి చేశారని ఓటు విలువపై చైతన్యపరిచేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కులు అమలకు అణచబడ్డ అణగారిన బహుజన అల్పసంఖ్యాక ప్రజలను భవిష్యత్తు తరాల ప్రజలు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు చట్టసభలకు పంపించేందుకు గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించి 85% మా ఓటు బ్యాంకుతో బిసి ఎస్సి ఎస్టి మైనారిటీలను పాలకులుగా తీర్చిదిద్దడమే ఇండియన్ ప్రజా కాంగ్రెస్ లక్ష్యమని అన్నారు. అక్టోబర్ 2న జరగవలసిన రాష్ట్ర సదస్సును పరిస్థితుల దృష్ట్యా అక్టోబర్ 7వ తేదీకి మార్చడమైనదని అన్నారు ఇందులో అన్ని జిల్లాల నుండి ఐపిసి డిల్ గేట్స్ పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల అధికార ప్రతినిధి పిల్లి భూలోకం, ఐ పి టి యు సి రాష్ట్ర అధికార ప్రతినిధి పొదిల వెంకట్రావు, గుంటూరు జిల్లా ఐ పి టి యు సి అధ్యక్షులు లక్కి పోగు గాబ్రియల్,ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఎలీషా గాంధీ, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పేటేటి శ్రీనివాస్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *