విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో దీర్ఘకాలంగా పెండిరగ్లో ఉన్న జలవనరుల శాఖకు సంబంధించి అక్రమణలను క్రమబద్దీకరించవలసిన భూములు విషయంపై జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ మంగళవారం జలవనరుల శాఖ అధికారులతో పరిశీలించారు. విజయవాడ సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గంలోని జనవనరుల శాఖ భూములను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఏలూరు కాలువ పక్కన ఉన్న అక్రమణల క్రమబద్దీకరణ, అంబేద్కర్ కాలనీ, పసుపుతోట, వెంకటేశ్వరనగర్, నరసరాజు రోడ్డు, నేతాజీ రోడ్డు, ఊర్మిళ నగర్, గాంధీజీ కాలనీ ప్రాంతాల భౌగోళిక సితిగతులను ఆమె పరిశీలించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని జనవనరుల శాఖ భూములను, శాసనసభ్యుల వెలంపల్లి శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు. పరిశీలనలో జాయింట్ కలెక్టర్ వెంట ఇరిగేషన్ ఎస్ఇ, తహాశీల్థార్ దుర్గాప్రసాద్ ఉన్నారు.
Prajavartha Online Telugu News