విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారులకు విరివిగా బుణాలను అందించి ప్రభుత్వ ఆశయాలు లక్ష్యాలను సాధించేందుకు బ్యాంకర్లు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు అధ్యక్షతన జిల్లా స్థాయి తొలి డిస్ట్రిక్ట్ కన్సల్టెటివ్ కమిటీ (డిసిసి), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ (డిఎల్‌ఆర్‌సి) బ్యాంకర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని బ్యాంకులకు నిర్దేశించిన బుణ లక్ష్యాలను సాధించిన ప్రగతిని ఆయా బ్యాంకుల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారులకు బ్యాంకర్స్ విరివిగా రుణాలను అందించి అధికారులతో సహకరిస్తున్నారన్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి, స్వయం సహాయ సంఘాలకు నిర్దేశించిన లక్ష్యాల మేరకు సకాలంలో బుణాలను అందించి సహకరించడం పట్ల కలెక్టర్ అభినందిస్తూ ఇదే స్పూర్తిన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోను కొనసాగించాలని కలెక్టర్ కోరారు. కౌలుదారులకు బుణాల మంజూరు, జగనన్న తోడు, వైయస్‌ఆర్ సున్నా వడ్డీ రుణాలు, నవరత్నాలు పేదలందరికి ఇళ్లు కార్యక్రమంలో భాగంగా 30.75 లక్షల ఇళ్లు లేని నిరుపేదలకు టిడ్కో ద్వారా చేపడుతున్న గృహ నిర్మాణాలకు బ్యాంకుల ద్వారా లబ్దిదారులకు బుణాలు అందించి సహకారించాలన్నారు.
జిల్లాలో 2022`23 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ ఎడాది ఏప్రిల్ 1వ తేది నుండి జూన్ 30వ తేదీ నాటికి జిల్లా క్రెడిట్ ప్లాన్ లక్ష్యం రూ.26,772 కోట్లకు గాను రూ.20,143 కోట్ల ఋణాలు మంజూరు చేసి 75.24 శాతం ఆర్థిక ప్రగతిని సాధించడం జరిగిందన్నారు. వీటిలో ప్రాధాన్యత రంగాలకు రూ.16,628 కోట్ల లక్ష్యానికి గాను రూ.4,504 కోట్ల రూపాయలు మంజూరు చేసి 27.09 శాతం గాను, ఇతర ప్రాధాన్యత రంగాలకు రూ. 10,144 కోట్ల రూపాయలకు రూ. 15,639 కోట్ల బుణాలు మంజూరు చేసి 154 శాతం నమోదు చేయడం జరిగిందన్నారు. వీటిలో ఖరీఫ్ రబీలో వ్యవసాయ రంగానికి రూ. 9,749 కోట్ల రుణ లక్ష్యంగాను రూ.2063 కోట్ల రుణాలను, సూక్ష్మ, చిన్న, మధ్య తరహ రంగాలకు రూ. 4,770 కోట్ల రుణ లక్ష్యాంగాను రూ. 2,270 కోట్ల రుణాలను, ఇతర ప్రాధాన్యతా రంగాలకు సంబంధించి రూ. 2,108 కోట్ల రుణ లక్ష్యాంగాను రూ. 173 కోట్ల రుణాలను మంజూరు చేయడం జరిగిందన్నారు.
సమావేశంలో 2022`23 వార్షిక బుణ ప్రణాళిక (యాన్వువల్ క్రెడిట్ ప్లాన్)ను కలెక్టర్ డిల్లీరావు విడుదల చేశారు.
2022`23 ఆర్థిక సంవత్సరానికి రూ.26,772 కోట్ల టోటల్ క్రెడిట్ అవుట్‌లే కాగా ప్రాధాన్యత రంగానికి కేటాయించిన 16,628 కోట్లలో 6,40,207 మంది లబ్దిదారులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా నిర్దేశించారు.
వ్యవసాయ రంగానికి రూ.9,749 కోట్లు కేటాయించగా కౌలు రైతులతో సహా 5.16 లక్షల మంది రైతులకు రుణాల మంజూరు నిర్దేశించారు. మొత్తం ప్రాధాన్యత రంగాలకు 16,228 కోట్ల రూపాయలు, ఇతర ప్రాధాన్యత రంగాలకు 2,109 కోట్ల రూపాయలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహ రంగాలకు 4,770 కోట్ల రూపాయల రుణాల లక్ష్యాలను, నాన్ ప్రయార్టి సెక్టర్‌కు రూ.10,144 కోట్లు నిర్దేశించడం జరిగింది.
సమావేశంలో డిసిసి, డిఎల్‌ఆర్‌సి కన్వినర్, యూనియన్ బ్యాంక్ డిప్యూటి జనరల్ మేనేజర్ ఎన్ శ్రీనివాస్‌రావు, ఆర్‌బిఐ ఏజియం, యం జడ్ రహ్మన్, ఎల్‌డియం పి కోటేశ్వరరావు, నాబార్డ్ మేనేజర్ స్మారక్ మహంతి, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.
Prajavartha Online Telugu News