Breaking News

చట్టసభల్లో బెస్తలకు ప్రకాశాలు కల్పించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాయలసీమ ప్రకాశం నెల్లూరు జిల్లాతో కలుపుకుంటే బెస్త కుల జనాభా 25 లక్షలు జనాభా ఉన్నప్పటికీ 75. ఏండ్ల సంవత్సర భారతంలో ఇంతవరకు టెస్టుల నుంచి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కూడా నామినేషన్ వేసిన దాఖలాలు లేవంటి మా టెస్తలను రాజకీయ పార్టీలు ఏ విధంగా వాడుకుంటున్నాయో అర్ధమవుతుందని బెస్త కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కె.వి.రమణ అన్నారు. గాంధీనగర్‌, ధర్నాచౌక్‌లో మంగళవారం జరిగిన బెస్తల రాజ్యాధికార దీక్షలో కె.వి.రమణ, వక్తలు మాట్లాడుతూ ఓట్లు వేయడానికి మాత్రమే పనికివచ్చే యంత్రాల్లాగా మమ్మల్ని వాడుకుంటూ ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ గాని స్వాతంత్ర అనంతరం. మాకు ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ కోటా ఇచ్చిన పాపాన పోలేదు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు మా కులాన్ని గుర్తించి మాకు రాయలసీమలో రాజ్యాంగ వద్ద పదవుల్లో చట్టసభల్లో అవకాశం కల్పించాలని నామినేటెడ్ పోస్టుల అవకాశాలు కల్పించాలని కోరుచున్నామన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా రాయలసీమలోని బిస్తలంచా ఒకడాటిపైకి వచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు ఇటువంటి తరుణంలో మాకు ఏ రాజకీయ పార్టీ అండదండలు కల్పిస్తాదో వారితో మేము ప్రయాణం చేస్తామని రాజకీయ పార్టీలకు తెలియజేస్తున్నామన్నారు. మా జనాభా మా దామాషా పద్ధతి ప్రకారం మాకు రాయలసీమలో నాలుగు ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలన్నారు. ఒక ఎంపి సీటు కేటాయించాలన్నారు. నామేటెడ్ పోస్టుల్లో మాకు అవకాశం కల్పించాలి ఇంతవరకు కార్పొరేషన్లలలో ఒక్క బెస్త కార్పోరేషన్ తప్ప ఇంకో కార్పొరేషన్ పదవి కూడా ఇవ్వని పరిస్థితి. రేపు జరగబోయే ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికల్లో మాకు అవకాశం కల్పించాలన్నారు. గతంలో రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీ మేరకు టెస్తలను ఎస్టీ జాబితాలో చేర్చాలన్నారు. రాయలసీమ జిల్లాలలో రెండు MLC సీట్లు కేటాయిం చాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌.రవీంద్ర, ఎన్‌ఎఎఫ్‌ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, కె.సోమయ్య, ఎన్‌ఎఎఫ్‌ కడప జిల్లా అధ్యక్షులు, భాస్కర్‌, సుధాకర్‌ తదితరులు  పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *