విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ TNTUC రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కేశినేని శివనాథ్(చిన్ని) కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుచూరి ప్రసాద్ మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కార్మికుల పొట్టగొట్టిందని, మాట తప్పి భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేసిందని, అందుకే TNTUC ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని దానికి అందరూ కలిసి రావాలని ఆయన అన్నారు.భవనిర్మాణ కార్మికసంఘం రాష్ట్ర బాధ్యులు పాల మాధవ మాట్లాడుతూ మూడు సంవత్సరాలు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని, పని లేక ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారని వారిని ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ చర్యలు చేపట్టకుండా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆయన అన్నారు.
కార్మికుల ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అందుకోసం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డును పథకాలను పెంచాల్సింది పొగ సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి పథకాలు నిలిపేయాలని 1214 ద్వారా సర్కులర్ ఇష్యూ చేసి పథకాల మొత్తం ఆపేసినటువంటి ఘనత, కార్మిక ద్రోహి ఈ జగన్ మోహన్ రెడ్డి అని ఆయన అన్నారు, సంక్షేమ బోర్డులో నిధులను కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు పెట్టాలని సుప్రీంకోర్టు, కేంద్ర కార్మిక చట్టాలు చెబుతున్న అది ఏ మాత్రం పట్టించుకోని జగన్ మోహన్ రెడ్డి తన సొంత అవసరాల కోసం సంక్షేమ బోర్డులో డబ్బులు వాడుకున్నాడని ఇలాంటి వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా TNTUC ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని దీనికి నిర్మాణరంగ కార్మికులందరూ ఆందోళన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మన బోర్డు మనం కాపాడుకోవడం, సంక్షేమ పథకాలన్నీ అమలు చేసుకోవడం కోసం జరిగే ఆందోళన కార్యక్రమంలో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
అనంతరం తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి స్వర్గీయ దేవినేని వెంకట రమణ జయంతి సందర్భంగా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో TNTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోకర ఆదిబాబు, రాష్ట్ర కార్యదర్శి తియ్యాల అప్పారావు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ లక్కిశెట్టి సాయి, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు రాజాలింగం తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News