Breaking News

రక్తాన్ని దానం చేసి ప్రాణాలను కాపాడుతున్న రక్తదాతలు అభినందనీయులు…

-నేత్రదానం చేసి అంధుల జీవితాలలో వెలుగులు నింపుదాం..
-జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
మానవ శరిరంలో వెలకట్టలేని రక్తాన్ని దానం చేయడం ద్వారా మరొకరి ప్రాణాన్ని కాపాడేందుకు దానం చేసేందుకు ముందుకు వచ్చిన ప్రతి రక్తదాతను అభినందించాలని జిల్లా కలెక్టర్‌ యస్‌.డిల్లీరావు అన్నారు.
దేశవ్యాపంగా నిర్వహిస్తున్న రక్తదాత శిబిరాల నిర్వహణలో భాగంగా లైన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ జూబ్లి హరిత మరియు వరుణ్‌ మోటార్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో బెంజ్‌సర్కిల్‌ వరుణ్‌ మోటార్స్‌ షోరామ్‌లో నిర్వహించిన రక్తదాన శిభిరాన్ని బుధవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ దేశటవ్యాప్తంగా లక్ష రక్త యూనిట్లు సేకరించడంలో భాగంగా జిల్లాలో ప్రత్యేక మెగా రక్త దాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరాల ద్వారా సేకరించిన రక్తాన్ని జిల్లాలోని 15 రక్తనిధి కేంద్రాల్లో బద్రపరచి అత్యవసర పరిస్థితులలో అవసరమైన రోగులకు ఉచితంగా అందిస్తున్నామన్నారు.
ప్రతీ రోజు రక్తం అవసరమైన ఎంతో మంది రోగులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడ క్షతగ్రాతులకు అవసరమైన రక్తాన్ని తక్షణమే అందించలేక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయన్నారు. రక్తదాతల సహకారంతో క్షతగ్రాతులకు, తలసెమియ వ్యాధిగ్రస్థులకు, రక్తహీనత కలిగిన గర్భిణీ స్త్రీలకు వైద్యులు సకాలంలో రక్తాన్ని అందించి ప్రాణాలను కాపాడుతున్నారన్నారు. ఒక సారి రక్తదానం చేసిన దాత మరొకరి ప్రాణాన్ని కాపాడినట్లేనన్నారు. రక్తదానం చేస్తే నీరసించి పోతామనే అపోహను తొలగించి రక్తదానం చేసిన ప్రతీ సారి మరింత ఆరోగ్యవంతమైన రక్తాన్ని పొందగలుగుతారనే విషయాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లి రక్తదానం వైపు మొగ్గు చూపేలా కృషి చేయాలన్నారు. ఎక్కువగా రక్తదానం చేసిన యువతే మరల రక్తదానం చేస్తున్నారని అలా కాకుండా కొత్తవారు కూడా ముందుకు వచ్చి స్వచ్చందంగా రక్తదాన శిబిరాలలో పాల్గొనేలా స్పూర్తిని నింపాల్సిన అవసరం ఉందన్నారు.
లైన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ జూబ్లి హరిత ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా సామాజిక సేవలందించడం అభినందనీయమన్నారు. అంధత్వం అనేది భరించలేని బాద అన్నారు. ఎంతో మంది అంధులు కంటి చూపులేక చీకటి బ్రతుకుతో మరోకరిపై ఆధారపడి జీవిస్తున్నారని ప్రకృతి అందాలను చూడలేక కనీసం తన రూపాన్ని కూడా చూసుకోలేని దుర్భరమైనది అంధత్వ జీవితమన్నారు. అంధులకు నేత్రాలను దానం చేసి వారి జీవితాలలో వెలుగులు నింపేందుకు నేత్రానంపై ప్రజలలో అవగాహన కల్పించేలా వరుణ్‌ మోటార్‌ సంస్థ ర్యాలీ నిర్వహించడాన్ని అభినందిస్తున్నానని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు తెలిపారు.
అనంతరం వరుణ్‌ మోటార్‌ సంస్థ ఉద్యోగులకు జిల్లా కలెక్టర్‌ మొక్కలను పంపిణీ చేసి నేత్రాదానం పై నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో వరుణ్‌ మోటార్‌ సంస్థ ప్రతినిధులు బి.గిరిబాబు, సిజియం టి.శ్రీనివాస్‌రావు, జియం వి. పద్మజ, సిహెచ్‌ గంగాధర్‌, లైన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు జె ఎన్‌ శంకర్‌గుప్తా, మిరియాల వెంకటేశ్వరరావు, ఏ. సత్యనారాయణ, . తాతినేని రాంబాబు, చలసాని అజయ్‌ కుమారి, గద్దె శేషగిరిరావు, కె.ఎస్‌ ఎన్‌ మూర్తి, కె. సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *