విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రైతు సంఘాలతో స్టార్టప్ కంపెనీలు అనుసందానం చేయవలసిన ఆవశ్యక ఎంతైన ఉందని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు పేర్కొన్నారు. బుధవారం నగరంలోని రాఘవయ్య పార్కు వద్ద ఉన్న ఏపి యూనైటెడ్ టీచర్స్పెడరేషన్ హాల్ నందు నాబార్డ్ సహకారంతో హైదరాబాద్ సీనియర్ బిజినెస్ డవలెప్మెంట్ మేనేజర్ డా.సత్యేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన రైతు సంఘాలు స్టార్టప్‌ల అనుసందాన కార్యక్రమం నిర్వహించారు. తూర్పు, పశ్చిమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతు సంఘాల ప్రతినిధులు స్టార్టప్ కంపెనీలు పాల్గొన్న ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ఎస్ డిల్లీరావు ముఖ్య అతిధిగా పాల్గొన్ని జ్వోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో రైతు సంఘాలను స్టార్టప్ సంస్థలతో అనుసందానం చేయవలసిన ఆవశ్యకత ఎంతైన ఉందన్నారు. దీనివలన రైతులు తాము పండిరచిన ఉత్పత్తులను లాభసాటిగా విక్రయించుకునేందుకు ఎంతో ప్రయోజన కరంగా ఉంటుందన్నారు. రైతు తమ ఉత్పత్తుల విక్రయానికి స్టార్టప్ ఒక చక్కని వేదికగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించి రైతులకు మద్దతు ధరను కల్పించేలా చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో యువత స్టార్టప్ కంపెనీల స్థాపనకు ముందుకు రావాలని కలెక్టర్ డిల్లీరావు సూచించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మరియు అనుబంధాల రంగాలకు చెందిన ఐడియా ` ఐసిఏఆర్ ` ఎన్‌ఏఏఆర్‌యం (నేషనల్ అకాడమి ఆఫ్ అగ్రికల్చర్ రిసర్చ్ మేనేజ్మెంట్) ద్వారా మద్దతు ఇచ్చే సుమారు 18 స్టార్టప్ కంపెనీలు, తమ ఉత్పత్తుల సేవలను అందించిన ఎఫ్‌పివోలు, తాము అందించిన సేవల ద్వారా లబ్దిపొందిన రైతులతో తమ అనుభవాలను తెలియజేశారు.
కార్యక్రమంలో నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ యం ఆర్ గోపాల్, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ దారుల సంఘం సిఇవో ఆషాకిరణ్, ఐడియా సిఇవో ఎస్ సెంథిల్ వినాయగం, నాబార్డ్ జనరల్ మేనేజర్ ఎన్ ఎస్ మూర్తి రైతు సంఘ నాయకులు రైతులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News