అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రభుత్వం చీఫ్ విప్ ఓ.ఎస్.డి. ఎం.ప్రభాకర్ రచించిన వయోలిన్ విధ్వాంసుడు “పెద్ద జమాలప్ప జీవిత సంగ్రహం” పుస్తకాన్ని మరియు వి.ఆర్.రెడ్డి రచించిన “చదవడం-వ్రాయడం” అనే పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం బుధవారం వారి చాంబరులో ఆవిష్కరించారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో రాజంపేట శాసన సభ్యులు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి, ఏ.పి. ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, శాసన సభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు, రచయిత వి.ఆర్.రెడ్డి, ప్రభుత్వం చీఫ్ విప్ ఓ.ఎస్.డి. ఎం.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News