Breaking News

సీఎం జగన్‌ను కలిసిన టాటా సన్స్‌ ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో టాటా సన్స్‌ చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ భేటీ అయ్యారు. సీఎం నివాసంలో బుధవారం జరిగిన ఈ భేటీలో ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించారు. ఏపీలో సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌, పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల్‌ వలవెన్‌, ఏపీఈడీబీ సీఈవో జవ్వాది సుబ్రహ్మణ్యం, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *