Breaking News

కన్యాశుల్కం కాపీలను ఆవిష్కరించిన సీఎం జగన్‌…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని శాసనసభలోని సీఎం కార్యాలయంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కలిశారు. మహాకవి గురజాడ అప్పారావు 160వ జయంతి సందర్భంగా ఆయన రచించిన కన్యాశుల్కం నాటకం పుస్తకాన్ని భూమన కరుణాకర్‌రెడ్డి ఐదువేల కాపీలను ముద్రించారు. వీటిని సీఎం జగన్‌ బుధవారం ఆవిష్కరించారు. ఈ కాపీలను విజయనగరంలోని గురజాడ ఇంటికి బహూకరించి.. సందర్శకులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు భూమన తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్‌) జీవీడీ కృష్ణమోహన్, చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *