Breaking News

రెండవ దశ మనబడి నాడు నేడు పనులు పూర్తి చేయాలి

-ఉపాధ్యాయుల ముఖ ఆధారిత హాజరు నమోదు శాతం పక్కాగ ఉండాలి
-జగనన్న విద్యా కానుక కార్యక్రమo పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలి
-పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్‌

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త:
ఉపాధ్యాయుల ముఖ ఆధారిత హాజరు నమోదు వంద శాతం పక్కాగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్‌ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గురువారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ విజయవాడలోని సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి, జాయింట్ కలెక్టర్ డి.కె బాలాజి సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెండో దశ మన బడి నాడు –నేడు పనులను పూర్తి చేసేందుకు ప్రణాళిక మైన చర్యలు చేపట్టాలని అధికారులను అదేశించారు. జిల్లాలో జగనన్న విద్యా కానుక అన్ని పాఠశాలలో ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే పంపిణీ మరియు బయోమెట్రిక్ పూర్తి చేయాలని తెలిపారు. సిమెంటు ఇసుక తదితరాలకు అంశాలకు అవసరమైన ఇండెంట్ ను ఎప్పటికప్పుడు పంపించాలని తెలిపారు.

జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వము మనబడి నాడు నేడు పనులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పనులలో నాణ్యత ప్రమాణాలను పాటించి నిర్దేశించిన గడువు లోపల పూర్తి చేయాలని తెలిపారు. ఇసుక, సిమెంటు వంటి నివేదికలను సమర్పించాలని మరియు నాణ్యత పాటించాలని తెలిపారు. జిల్లాలో నాడు నేడు పనులను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేసేలా చూడాలని తెలిపారు. విద్యా కానుక పంపిణీ కార్యక్రమాన్ని పెండింగ్ మెటీరియల్ ఏమైనా ఉంటే పూర్తిస్థాయిలో పంపిణీ జరిగేలా చూడాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డి ఈ ఓ శేఖర్, నాడు-నేడు జిల్లా కో ఆర్డినేటర్ రామచంద్రారెడ్డి, జే వి కే జిల్లా నోడల్ అధికారి శివశంకర్ , ఐ సి డి ఎస్ పి డి జయలక్ష్మి, డి వి ఈ ఓ స్వర్ణలత,తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *