విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయిలో అధికారులతో కలసి మంగళవారం అజిత్ సింగ్ నగర్ లోని 20 టన్నుల సామర్ధ్యం కలిగిన తడి వ్యర్ధ పదార్దముల (కూరగాయలు) నుండి గ్యాస్ మరియు కరెంటును ఉత్పత్తి చేసే నగరపాలక సంస్థ బయోమెథనేషన్ పవర్ ప్లాంట్ (20 TPD Biomethanation based power plant) యొక్క పని తీరును పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేసారు. ప్లాంట్లు నందుకు ప్రతి రోజు ఎన్ని టన్నుల తడి వ్యర్ధ పదార్దముల (కూరగాయలు) వచ్చుచున్నది, దాని వల్ల ఎంత గ్యాస్ ఉత్పత్తి అవుతుందని తదుపరి ఆ గ్యాస్ నుండి ఎన్ని గంటలు జనరేటర్ పని చేటడం ద్వారా ఎన్ని యూనిట్లు ఉత్పత్తి అవుతుందని తెలుసుకున్నారు. సదరు ఉత్పత్తి పెరుగుదలకై నగరంలోని అన్ని రైతు బజార్లలలో మరియు ప్రతి రోజు నివాసాల నుంచి ఉత్పత్తి ఆవుతున్న చెత్త వ్యర్ధములను ప్రోసెస్ చేయుట వల్ల మన నగరం పరిశుభ్రంగా చెత్త రహిత మరియు కాలుష్య రహితం తిర్చిదిద్దుటకు దోహదపడుతుందన్నారు. ఈ సందర్భంగా ప్లాంట్ ఆహ్లాదకరంగా ఇండస్ట్రియల్ వాతావరణ కలిగి ఉండే విధంగా తీర్చిదిద్దాలని, ఆరోగ్యకరమైన వాతావరణంలో ఆయా ప్లాంట్లను నిర్వహించినట్లయితే ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండుటయే కాకుండా ప్లాంట్ లలో సి.సి రోడ్లు మరియు ప్లాంటేషన్ ఏర్పాట్లు చేయాలనీ సంబంధిత అధికారులకు ఆదేశించినారు. పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News