విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
మున్సిపల్ జడ్జి యు. రామ్మోనరావు అధ్యక్షతన APP సిద్దీఖ్ సమీక్షంలో హెల్త్ ఆఫీసర్ డా. రామ కోటేశ్వరరావు, పర్యవేక్షణలో సర్కిల్-2 నగరపాలక సంస్థ కార్యాలయం నందు పరిసరాల పరిశుభ్రత, ప్రజల ఆరోగ్య సంరక్షణ విధానాలు, క్లీన్ అండ్ గ్రీన్, క్లీన్ A.P (CLAP) గురించి అవగాహన సదస్సు ను నిర్వహించినారు. దీనిలో భాగంగా సర్కిల్-2 పరిధిలో ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న వారిని గుర్తించి వారిచేత అపరాధ రుసుం కట్టించినారు. అలాగే కాలువల్లో, రోడ్ల మిద చెత్త వేస్తున్న వారి మిద, రోడ్ల మిద గేదెలను, వదిలివేస్తున్న వారి మిద కఠీన చర్యలు తిసుకోనవలెను. వారి వద్ద నుంచి కుడా అపరాధ రుసుం వసూలు చేసినారు. ఇందులో భాగంగా 41 మంది నుండి రూ. 24,540 వసూలు చేయడం జరిగినది. ఈ కార్యక్రమం లో మున్సిపల్ కోర్టు సిబ్బంది, సర్కిల్-2 పరిధిలోని శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ లు, శానిటరీ సెక్రటరీలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News