విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్/ కలెక్టర్, కృష్ణా మరియు వారి ఆదేశాల మేరకు 81-విజయవాడ తూర్పు నియోజక వర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రములకు సంబంధించి రేషన్ లైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషనలు అనగా ప్రతి పోలింగ్ కేంద్రమునకు 1500 ఓటర్లు పైబడి ఉన్న యెడల కొత్త పోలింగ్ కేంద్రమునకు ప్రతి పాదన / సూచనలు మరియు పోలింగ్ కేంద్రమునకు సంబంధించిన పేర్లు మార్పులు, చేర్పులు మరియు ఓటర్ల నమోదు కార్యక్రమాలు గురించిన వివరములు గురించి చర్చించియున్నారు. ఇందులో భాగంగా తూర్పు నియోజకవర్గమునకు సంబంధించిన అన్ని గుర్తింపు పొందిన రాజికియ పార్టి ప్రతినిధులతో ది.27.09.2022 , సాయత్రం 4.00 ని,,లకు జిల్లా రెవిన్యూ అధికారి మరియు సబ్ కలెక్టర్, ఎన్ టి ఆర్ జిల్లా , విజయవాడ వారి కార్యాలయములో సమావేశమును ఏర్పాటు చేసియున్నారు. ఇందు తూర్పు నియోజకవర్గమునకు సంబంధించిన అన్ని గుర్తింపు పొందిన రాజికియ పార్టి ప్రతినిధులు వారు పాల్గొని రేషన్ లైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషనలు అనగా ప్రతి పోలింగ్ కేంద్రమునకు 1500 ఓటర్లు పైబడి ఉన్న యెడల కొత్త పోలింగ్ కేంద్రమునకు ప్రతి పాదన / సూచనలు మరియు పోలింగ్ కేంద్రమునకు సంబంధించిన పేర్లు మార్పులు, చేర్పులు ఏమియు లేవు అనియు మరియు కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమము, చనిపోయిన , డూప్లికేట్ మరియు బదిలి అయిన ఓటర్లు మార్పులు /చేర్పులు మరియు ఆధార్ తో ఓటర్ అనుసంధాన ప్రక్రియ వైగెరాలు గురించి చర్చించియున్నరు. తూర్పు నియోజకవర్గమునకు సంబంధించిన బూత్ లెవెల్ ఏజెంట్స యొక్క వివరములు త్వరితిగతిన ఇవ్వవలసినిదిగా కోరడమైనది. సదరు కార్యక్రమమునకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, మరియు సబ్ కలెక్టర్ , ఎన్ టి ఆర్ జిల్లా , విజయవాడ , అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్, నగరపాలక సంస్థ మరియు అన్ని గుర్తింపు పొందిన రాజికియ పార్టి ప్రతినిధులు మరియు తూర్పు నియోజకవర్గమునకు సంబంధించిన డిప్యూటీ తహసీల్దార్ మరియు వారి యొక్క సిబ్బంది పాల్గొనియున్నారు.
Prajavartha Online Telugu News