Breaking News

శ్రీ విజయకీలాద్రి దివ్య క్షేత్రం పై శరన్నవరాత్రి ఉత్సవాలు…

సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త:
గుంటూరు జిల్లా సీతానగరం శ్రీ విజయకీలాద్రి దివ్య క్షేత్రం పై మరియు వేద విశ్వవిద్యాలయం నందు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారు మరియు శ్రీశ్రీశ్రీ అహోబిల జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈరోజు ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవములలో భాగంగా. 6వ రోజున ఉదయం ధాన్యలక్ష్మి అమ్మవారికి 9 కలశాలతో అభిషేకం, అలంకరణ, ద్వార తోరణ ధ్వజ కుంభారాధన, ధాన్యలక్ష్మి ఆరాధన, శ్రీయాగం, పండితోత్తములచే చతుర్వేద, ఇతిహాస, పురాణ స్తోత్ర దివ్య ప్రబంధ పారాయణములు, అనంతరం పూర్ణాహుతి, మంగళ శాసనం, తీర్థ ప్రసాద గోష్టితో ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. సాయంకాలం ధాన్యలక్ష్మి అమ్మవారి వాహన సేవ ఎంతో వైభవంగా జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *