Breaking News

ఐపియం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా, అలసత్వం వహించే అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి… :వినుకొండ రాజారావు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
వైద్య ఆరోగ్య శాఖలో ఎంతో ప్రాధాన్యత కలిగిన ఐపిఎం నేడు మసక బారుతుందని దానికి కారణం ఐపీఎం అధికారులేనని ప్రభుత్వం జోక్యం చేసుకొని ఐపిఎం డైరెక్టరేట్ లోని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమని కోరుతూ నేడు విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ ఐపిఎం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ మరియు పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ 3194 లు,ఐ.పి.యం ఉద్యోగుల సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారమైయ్యేంత వరకు వెన్నంటి ఉంటామని,అవసరమైతే సమస్యల పరిష్కారానికి ఐక్య ఉద్యమాలకు,ధర్నా లకు సైతం వెనుకాడేది లేదని సమస్యలను పరిష్కారం అయ్యేవరకు వెంట ఉంటామని యునైటెడ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి వెంకటేశ్వర్లు , మరియు పబ్లిక్ హెల్త్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ 3194 రాష్ట్ర అధ్యక్షుడు టి డి కే సాగర్ గారు సమావేశంలో పాల్గొని మద్దతు తెలియజేశారు సమావేశం ప్రారంభం కు ముందు నేడు గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత మహత్మగాంధి, మరియు భారత దేశ మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలను ఆవిష్కరించి వారు దేశానికి చేసిన సేవలను కొనియాడి వారిరువురికి ఘనంగా నివాళులర్పించిన తర్వాత సమావేశం ను ప్రారంభించడం జరిగింది.
ఈ సమావేశంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించమని రాతపూర్వకంగా రాష్ట్ర చీప్ సెక్రటరీ సమీర్ శర్మ గారికి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి యం.టి.కృష్ణబాబుగారికి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర గారికి మరియు జె.నివాస్ కమీషనర్ వైద్య ఆరోగ్య శాఖ,కుటుంబ సంక్షేమం మరియు ఫుడ్ సేఫ్టీ వారికి పంపించడం జరిగింది.
రీ ఆర్గనైజేషన్-2014 బై ఫర్గేషన్ జివో 106 ప్రకారం తెలంగాణ రాష్ట్ర నుండి స్వరాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన ఉద్యోగులకు మూడు నెలలుగా పోస్టింగులు లేవని జీతాలు కూడా లేవని వాటిని వెంటనే ఇప్పించాలని అధికారులుగా వచ్చిన వారికి పదోన్నతులు కల్పించాలని, ఐపిఎమ్ డిపార్ట్ మెంట్ లో 19 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు శాంపిల్ టేకర్స్ వారిని కొనసాగించాలని వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, జీవో ఎంఎస్ నెంబర్ 106 ద్వారా ఆంధ్రప్రదేశ్ వచ్చిన ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, ఆహార తనిఖీ మొబైల్ ల్యాబ్స్ ను వెంటనే ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించాలని, ఫుడ్ శాంపిల్స్ హైదరాబాద్ లొ కాకుండా ఆంధ్రప్రదేశ్ లోనే స్టేట్ ఫుడ్ లేబరేటరీ ద్వారా పరీక్షలు జరగాలని వస్తున్న రెవిన్యూ తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ కు చెందేలాగున అధికారులు చర్యలు తీసుకోవాలని, ఐపియం లో ఉన్న అన్ని విభాగాలు వాటర్ ల్యాబ్స్,డిస్టిక్ట్ ల్యాబ్స్, బ్లడ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ సెంటర్, స్టేట్ ఫుడ్ లాబరేటరీ,ర్యాబిస్ వ్యాక్సిన్ సెంటర్, ఇలా అన్ని విభాగాలను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలని, వ్యాక్సినేషన్ సెంటర్లో ఉన్న ఏడు ఏడిపి పోస్టులను అర్హత ఉన్న వారికి పదోన్నతులు కల్పించాలని, ఐపీఎంలో ఏసీబీ కేసులు, ఆరోపణ ఎదుర్కొంటున్న 2014-2019 సంవత్సరం వరకు ఉన్న కేసులను పరిష్కరించుటకు ప్రభుత్వం నియమించిన కమిటీకి నివేదిక అందజేయాలని వాటి పరిష్కారానికి చొరవ చూపాలని, అర్హులైన ఎఫ్ఎస్ఓ లకు గజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ పదోన్నతులు కల్పించాలని, ఐపిఎంకు పూర్తిస్థాయిలో డిప్యూటీ ఫుడ్ కంట్రోలర్, జాయింట్ ఫుడ్ కంట్రోలర్ పోస్టులను అర్హులైన వారితో వెంటనే భర్తీ చేయాలని, ఐపిఎంలో వాటర్ సెక్షన్ లో పూర్తిస్థాయిలో డిప్యూటీ చీఫ్ వాటర్ లిస్ట్ మరియు చీఫ్ వాటర్ ఎనలిస్టు పోస్టులను అప్ గ్రేడ్ చేయించాలని, ఐపిఎం ఉద్యోగుల సర్వీసు సంబంధించిన విషయాలు వెంటనే పరిష్కరించాలని, సర్వీస్ మేటర్స్ న్యాయస్థానాలకు వెళ్లకుండా చూడాలని, అర్హులైన వారికి జూనియర్ ఎనలిస్ట్ మరియు సీనియర్ ఎనలిస్ట్ పదోన్నతులు కల్పించాలని, ప్రభుత్వం హెడ్ క్వార్టర్ లో మంజూరు చేసిన ఔట్సోర్సింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ల్యాబొరేటరీల్లో మరియు ఫుడ్ ఆఫీసుల్లో విధులు నిర్వహిస్తున్న కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ నియమ నిబంధన ప్రకారం వేతనాలు చెల్లించాలని, హైదరాబాదులో ఉన్న ఐపిఎం లోని ఆస్తులను 58:42 ప్రకారం బ్యాంకు బ్యాలెన్స్, అలాగే హెల్త్ డెవలప్ మెంట్ సొసైటీ2014 ముందు ఉన్న ఆంధ్రప్రదేశ్ వాటా మరియు వాహనాలు, నాచారం మరియు నారాయణగూడ లోని ఆస్తులు వెంటనే ఆంధ్రప్రదేశ్ కు తెప్పించడానికి అధికారులు చొరవ చూపాలని, ఐపిఎమ్ డైరెక్టరేట్ లోని కార్యాలయంలో కార్యాలయ పర్యవేక్షణ అధికారిగా సీనియర్ పక్కనపెట్టి జూనియర్ కు కార్యాలయ పర్యవేక్షణ అధికారిగా కొనసాగించడం సీనియర్ ఉద్యోగులను అవమానించడమేనని, వెంటనే సీనియర్ ను కార్యాలయ సూపరింటెండెంట్ గా నియమించాలని, ఐపిఎం డిపార్ట్ మెంట్ లో అక్రమంగా కొనసాగుతున్న అధికారులను వెంటనే ప్రభుత్వానికి సరెండర్ చేయాలని వారిపై తగిన విధంగా చర్యలకు ప్రభుత్వానికి సిఫారసు చేయాలని, ఐపిఎంలో జోనల్ సమస్య ఎదుర్కొంటున్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఐపిఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వారానికి ఒక రోజు విజిటింగ్ సమయంలో మూడు నుండి ఐదు గంటల వరకు ఐపీఎం అధికారులతో ఐపిఎం ఉద్యోగుల సంఘం నాయకులతో డిపార్ట్ మెంట్ ఇంటర్నల్ జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని, ఉద్యోగుల సర్వీసు మరియు సంక్షేమం కొరకు ఐపిఎం కార్యాలయంలో ఐపీఎం ఉద్యోగుల సంఘానికి రూము కార్యాలయం కొరకు ఏర్పాటు చేయాలని, అలాగే డిప్యూటీ పబ్లిక్ అనలిస్ట్ మరియు చీప్ పబ్లిక్ ఎనలిస్ట్ పోస్టులను అప్ గ్రేడ్ చేయించాలని, అలాగే సీఎంఓ లో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ వారి విధులకు అర్హత లేని జూనియర్ ఎనలిస్ట్ లకు డ్యూటీ లు వేస్తున్నారని రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని,సియంఓ డ్యూటీ నుండి జూనియర్ అనలిస్ట్ లను తప్పించాలని, వాస్తవానికి ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ వారు సీఎంఓలో ఫుడ్ టెస్టింగ్ చేయాలని ఉత్తర్వులు ఉన్నాకూడా దానికి విరుద్ధంగా జూనియర్ అనలిస్ట్ లకు డ్యూటీ లు వేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని, అలాగే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి డైరెక్టరేట్ కు ఉద్యోగులు వెళితే ఆ సమస్యలను పట్టించుకోకుండా, పరిష్కరించకుండా, అగౌరపరిచేలా మాట్లాడుతూ, నిర్లక్ష్యంగా, చులకన భావంతో ఉద్యోగులను తక్కువగా చూస్తున్న ఇన్ చార్జి డైరెక్టర్ ని వెంటనే తొలగించాలని ఐపిఎం డైరెక్టరేట్ కు స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలని, పై సమస్యలను ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఐపిఎం ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేయుచున్నది. నేడు జరిగిన సమావేశంలో రాష్ట్ర సంఘ అధ్యక్షుడు వినుకొండ రాజారావు, ఎఎఫ్ సి ఆందరావు, సప్పా.శ్రీనివాసరావు, ఫుడ్ ఆఫీసు సూపరింటెండెంట్ వి.రవి, సీనియర్ అనలిస్ట్ వై.శివరామకృష్ణ,ఆర్. శ్రీనివాసులు, జి.అఖిల్, వేమవరపు శివకుమార్, కోటపాటి శ్రీనివాసరావు, యన్.భాస్కర్ రావు,గంగాధర్,డి.వియస్ రాజు, గాదె శివ శంకర్, కె.వాణి, వి.యన్.కళ్యాణి బిటిఎ నాయకులు జాలాది మోహన్, బి.సురేష్, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *