విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దసరా నవరాత్రి పర్వదినం సందర్భంగా ప్రజలందరికి ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరుకొంటూన్నట్టు తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఈ మేరకు పత్రిక ప్రకటన విడుదల చేసిన అవినాష్ తెలుగు ప్రజాలందరికి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తొమ్మిది రోజులుగా ఎంతో పవిత్రంగా అమ్మవారిని పూజించుకొన్న భక్తులు శాంతిసౌఖ్యలతో పండుగ జరుపుకోవాలని అవినాష్ ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News