ఇంధ్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త:
అమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. సోమవారం రాత్రి ఇంద్రకీలాద్రికి చేరుకున్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా అమ్మవారికి చీర, సారె సమర్పించి, అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ వేద పండితుల ఆశీర్వచనం పలికి అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. అనంతరం మీడియా పాయింట్ కి చేరుకున్న మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ దసరా ఉత్సవాలు బాగా జరుగుతున్నాయన్నారు. ఈరోజు దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, జగనన్న ఇలానే సపరిపాలన అందిస్తూ ప్రజల కష్టాలను దూరం చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు తీయించే విధంగా అమ్మ ఆశీర్వాదించాలని కోరుకోవడం జరిగిందన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రమంతా సుభిక్షంగా ఉందని రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు జలకళతో కళకళలాడుతున్నాయని, ముఖ్యంగా రైతులు సంతోషంగా ఉన్నారని మనమంతా చూస్తున్నామన్నారు. గతంలో కరోనా కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఇలాంటి మహమ్మారి ఇంకొకటి రాకుండా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆ తల్లి ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. టెంపుల్ టూరిజం అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు సర్క్యూట్ దేవాలయాలను గుర్తించి ఎక్కువగా భగవంతుని మీద నమ్మకం ఉన్నవారికి, పీఠాధిపతులకు భక్తి భావం ఉన్నవారికి సర్క్యూట్స్ ను పంపడం జరిగిందన్నారు. వాటిలో ఐదు ఎంపిక చేయడం జరిగిందన్నారు. మిగతా రాష్ట్రాల్లో ఒక్క టెంపుల్ ఉన్న అభివృద్ధి బాగా అభివృద్ధి చేశారన్నారు. మన రాష్ట్రంలో చాలా పురాతన దేవాలయాలు ఉన్నాయన్నారు. మన రాష్ట్రంలో 5 సర్క్యూట్స్ లో పంచారామాలు, శక్తి పీఠాలు, గోల్డెన్ ట్రయాంగిల్స్ ను ఎంపికచేసి శాసనసభలో కూడా ప్రకటించడం జరిగిందనీ మంత్రి ఆర్కే రోజా తెలిపారు.
Prajavartha Online Telugu News