విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దసరా మహోత్సవాలలో బాగంగా మంగళవారం ఎన్.టి.ఆర్. జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీ రావు ఐ.ఏ.ఎస్., నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్. మరియు దేవస్థాన ఈ.ఓ. బ్రమరాంబ ల ఆధ్వర్యంలో దసరా చివరి రోజు చివరి అంకం అయిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవం లో బాగంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను అత్యంత వైభవంగా పై నుండి ఉరేగించుకుంటూ దుర్గా ఘాట్ కు తీసుకువచ్చి అనంతరం హంస వాహనం పై కృష్ణా నదిలో తెప్పోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎన్.టి.ఆర్. జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీ రావు ఐ.ఏ.ఎస్., నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్. మరియు దేవస్థాన ఈ.ఓ. బ్రమరాంబ లు దుర్గాఘాట్ కు చేరుకొని తెప్పోత్సవ కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించి అన్ని శాఖల అధికారులకు మరియు సిబ్బందికి తగు సూచనలు మరియు సలహాలు అందించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఇన్ ఛార్జ్ డి.సి.పి. కొల్లి శ్రీనివాస్, ఎస్.బి.ఏ.డి.సి.పి. సి.హెచ్.లక్ష్మీపతి, ట్రాఫిక్ ఏ,డి,సి.పి టి.సర్కార్, పశ్చిమ ఏ.సి.పి. డా.కె. హనుమంత రావు, దేవస్థాన అధికారులు మరియు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News