Breaking News

తెప్పోత్సవ ఏర్పాట్ల పరిశీలనలో పాల్గొన్న నగరపోలిస్ కమీషనర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దసరా మహోత్సవాలలో బాగంగా మంగళవారం ఎన్.టి.ఆర్. జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీ రావు ఐ.ఏ.ఎస్., నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్. మరియు దేవస్థాన ఈ.ఓ. బ్రమరాంబ ల ఆధ్వర్యంలో దసరా చివరి రోజు చివరి అంకం అయిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవం లో బాగంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను అత్యంత వైభవంగా పై నుండి ఉరేగించుకుంటూ దుర్గా ఘాట్ కు తీసుకువచ్చి అనంతరం హంస వాహనం పై కృష్ణా నదిలో తెప్పోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎన్.టి.ఆర్. జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీ రావు ఐ.ఏ.ఎస్., నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్. మరియు దేవస్థాన ఈ.ఓ.  బ్రమరాంబ లు దుర్గాఘాట్ కు చేరుకొని తెప్పోత్సవ కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించి అన్ని శాఖల అధికారులకు మరియు సిబ్బందికి తగు సూచనలు మరియు సలహాలు అందించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఇన్ ఛార్జ్ డి.సి.పి. కొల్లి శ్రీనివాస్, ఎస్.బి.ఏ.డి.సి.పి. సి.హెచ్.లక్ష్మీపతి, ట్రాఫిక్ ఏ,డి,సి.పి టి.సర్కార్, పశ్చిమ ఏ.సి.పి. డా.కె. హనుమంత రావు, దేవస్థాన అధికారులు మరియు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *