Breaking News

నగరం లో” కృతుంగ” రెస్టారెంట్ ప్రారంభం…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో కృతుంగ రెస్టారెంట్ 31 వ ఔట్లెట్ విజయదశమి బుధవారం మొగల్రాజపురంలో జమ్మి చెట్టు సెంటర్ నందు ప్రారంభించబడింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి గ్రూప్ ఆఫ్ కాందారి హోటల్స్ చైర్మన్ ముత్తవరపు మురళీకృష్ణ పాల్గొని ఆయన మాట్లాడుతూ కృతుంగ రెస్టారెంట్ ప్రారంభించడం నగరవాసులకు భోజన ప్రియులకు సంతోషకరమైన వార్తని అన్నారు. రాయలసీమ వంటకాలు కృతుంగా ప్రత్యేకతని ఆయన అన్నారు. రాయలసీమ వంటకాలు ఇప్పుడు విజయవాడ ప్రజలకు అందుబాటులో ఉంటాయని అన్నారు. కృతుంగ రెస్టారెంట్ వ్యవస్థాపకురాలు ఉష మాంధ్ర మాట్లాడుతూ రాయలసీమ వంటకాలు కోడి కూర , రాగి సంగటి, రకరకాల వంటకాలతో మా రెస్టారెంట్లో అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కృతుంగ రెస్టారెంట్ నిర్వహకులు అవినాష్, వంశీ మాట్లాడుతూ మా రెస్టారెంట్లో అన్ని రకములు రుచులు, తలకాయ మాంసం, కోడి కూర, రాగి సంగటి, జొన్న రొట్టి మా ప్రత్యేకత అని అన్నారు. విశ్రాంత జాయింట్ కమిషనర్ జీఎస్టీ ఎం లింగారెడ్డి గౌరవ అతిథులు గా మరియు మేనేజింగ్ పార్ట్నర్స్ అనంతమాంద్ర, మనీషామాంద్ర, సి ఓ ఓ మోనిషా.కె పాల్గొని రాయలసీమ వంటకాలు గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కృతుంగ రెస్టారెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *