విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ డేటాకు ఆధార్ అనుసంధాన ప్రక్రియను ఎటువంటి తప్పులు లేకుండా డిసెంబర్ నాటికి నూరు శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు రేషన్ లైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్లు, ఓటర్ డేటాకు ఆధార్ అనుసంధానం, ఫారమ్-6 బి, ఓటర్ల నుంచి ఆధార్ వివరాలు సేకరణ, పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ, ఓటర్ల జాబితా రూపొందించడం తదితర అంశాలపై గురువారం నగరంలోని మాంటిస్సోరి కళాశాలలో కలెక్టర్ డిల్లీరావు బూత్ లెవెల్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ప్రతీ పోలింగ్ కేంద్రానికి 1500 మంది ఓటర్ల కన్న ఎక్కువ ఉన్న చోట కొత్త పోలింగ్ కేంద్రానికి ప్రతి పాదనలు, సూచనలు, పోలింగ్ కేంద్రానికి సంబంధించి పేర్ల మార్పులు, చేర్పులలో భాగంగా పున్నమ్మ తోట మాంటిస్సోరి మహిళ కళాశాలలో ఉన్న పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ డిల్లీరావు తనిఖీ చేశారు. ఆధార్‌తో ఓటర్ అనుసంధాన ప్రక్రియ పై పారమ్ `6 బి దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బూత్ లెవెల్ అధికారులతో కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ డేటాకు ఆధార్ అనుసంధానం ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో నేటి వరకు 16 లక్షల 49 వేల 533 మంది ఓటర్లు నమోదై ఉన్నారన్నారు. వీటిలె ఇప్పటి వరకు 9 లక్షల 39 వేల 341 మంది ఓటర్ల డేటాకు ఆధార్ అనుసంధానం ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని ఇది 60 శాతంగా నమోదు కాబడిరదన్నారు. మిగిలిన ఓటర్ల డేటాకు ఆధార్ డేటాతో అనుసంధాన ప్రక్రియ డిసెంబరు నాటికి పూర్తి చేయాలని బిఎల్వోలను కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా నగరంలోని విజయవాడ, తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలలో మరింత వేగవంతం చేయవలసిన అవసరం వుందన్నారు. తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలలో ఓటర్ డేటాకు అనుసంధానం 70 శాతానికి పైగా నమోదు చేయడం జరిగిందన్నారు. ఫారమ్ ` 6బిలో ఆధార్ వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలన్నారు. ప్రతి ఫారమ్ పైన సంతకం తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
ఓటర్ డేటాకు ఆధార్ అనుసంధానం ప్రక్రియలో భాగంగా నేటి వరకు తిరువూరు నియోజకవర్గంలో 2,06,704 మంది ఓటర్ల డేటాకు గాను 1,53,256 మంది ఓటర్లకు ఆధార్ అనుసంధానం 74.14 శాతం. నందిగామ నియోజకవర్గంలో 1,99,976 మంది ఓటర్ల డేటాకు గాను 1,42,090 మంది ఓటర్లకు ఆధార్ అనుసంధానం 71.05 శాతం. జగ్గయ్యపేట నియోజకవర్గంలో 1,99,053 మంది ఓటర్ల డేటాకు గాను 1,45,872 మంది ఓటర్లకు ఆధార్ అనుసంధానం 73.28 శాతం. మైలవరం నియోజకవర్గంలో 2,81,996 మంది ఓటర్ల డేటాకు గాను 1,63,642 మంది ఓటర్లకు ఆధార్ అనుసంధానం 58.03 శాతం. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 2,65,338 మంది ఓటర్ల డేటాకు గాను 1,24,549 మంది ఓటర్లకు ఆధార్ అనుసంధానం 46.94 శాతం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 2,37,530 మంది ఓటర్ల డేటాకు గాను 1,04,960 మంది ఓటర్లకు ఆధార్ అనుసంధానం 44.19 శాతం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 2,58,936 మంది ఓటర్ల డేటాకు గాను 1,04,972 మంది ఓటర్లకు ఆధార్ అనుసంధానం 40.54 శాతం పూర్తి చేయడం జరిగిందని డిసెంబర్ మాసాంతానికి నూరు శాతం ఓటర్ డేటాకు ఆధార్ అనుసంధానం ప్రక్రియ పూర్తి కావాలని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
పరిశీలనలో ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, సబ్ కలెక్టర్ డిఆర్వో కె. మోహన్ కుమార్, నగరపాలక సంస్థ అదనపు కమీషనర్, అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎం. శ్యామల, బూత్ లెవెల్ అధికారులు సూపర్ వైజర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News