Breaking News

దిల్లీబాబు… నిన్ను సల్లంగా చూడాలి… దుర్గమ్మ తల్లి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గంటలోనే అమ్మ దర్శనం అయింది. సంతోషంగా ఉంది డిల్లీబాబు… భవాని దీక్ష తీసుకుని నిష్టగా పూజలు చేశాం. శ్రీకాకుళం జిల్లా నుండి మనోళ్ళం చాలా మంది వచ్చాం. ఉదయానే ఘాట్‌లో జల్లు సాన్నం చేసి అమ్మ దర్శనానికి బయదేళ్ళాం గంటలోనే అమ్మ దర్శనం చేసుకున్నాం. ఇదివరకి వచ్చిన్నప్పుడు నాలుగు ఐదు గంటలు లైన్‌లోనే ఉండెటోళ్ళం తోపులాటలతో బయపడేవాళ్ళం ఇప్పడు ఆ బాదలేకుండా చేశావు లైన్‌లో వేడివేడి పాలు ఇచ్చారు. అమ్మ దర్శనం అయ్యాక అన్నప్రసాదాన్ని పెట్టారు. కావాల్సిన లడ్డు ప్రసాదాలు తీసుకున్నాం. సంతోషంగా వెళ్ళుతున్నామయ్యా. ఇలాంటి ఏర్పాట్లు చేయించిన నిన్ను ఆ తల్లి సల్లంగా చూస్తుందయ్యా..అంటూ భవానిలు జిల్లా కలెక్టర్‌ డిల్లీరావుతో వారి అనందాన్ని పంచుకున్నారు.
గురువారం ఆంధ్రా, తెలంగాణ జిల్లాల నుండి లక్షలాధిగా తరలివచ్చిన భవాని భక్తులతో ఇంద్రకీలాద్రి ఎరుపు మయంగా మారింది. భవానీలకు కనకదుర్గమ్మ అమ్మవారి దర్శన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ స్వయంగా పరిశీలించి కనకదుర్గ నగర వద్ద భవాని భక్తులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా మందస గ్రామం నుండి అమ్మవారి దర్శనానికి వచ్చిన భవాని భక్తులు వడేపల్లి సత్యవతి, మందాడ కనకమ్మ, సనపల నరసింహులు మాట్లాడుతూ మేము ఎప్పటి నుండో భవాని దీక్ష తీసుకుంటున్నామయ్యా. ప్రతి ఏడాది దసరా పండగ రోజు అమ్మవారి దర్శనానికి వస్తున్నాం. ఇంత తొందరగా ఎప్పడు మాకు అమ్మ దర్శనం కాలేదు అమ్మను బాగా చూసుకున్నాం. చాలా సంతోషంగా ఉందయ్యా అంటూ అనందాన్ని వ్యక్తం చేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్‌ లడ్డు విక్రయ కౌంటర్లను పరిశీలించి ఎప్పటికప్పుడు లడ్డుల స్టాకును అందుబాటులో ఉంచుకుని భవాని భక్తులకు కావాల్సిన లడ్డులను అందజేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సిబ్బందిని ఆదేశించారు. కనకదుర్గ నగర్‌ లో భవాని భక్తుల సౌకర్థం అదనపు బయోటాయిలెట్‌లను యుద్దపాతిపదికన ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. కనకదుర్గ నగర్‌ ఇంద్రకీలాద్రి, జల్లు సాన్న ఘట్టాల వద్ద నిరంతరం పారిశుద్ద్యం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మరో రెండు రోజుల పాటు భవాని భక్తుల రద్దీ ఉండే అవకాశం ఉందని దీనిని దృష్టిలో పెట్టుకుని రెవెన్యూ, పోలీస్‌, దేవదాయ, మున్సిపల్‌ తదితర శాఖల అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తతతో విధులు నిర్వహించాలని కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *