-భక్తులకు కోరినన్ని లడ్డులు విక్రయించేందుకు సిద్దంగా ఉంచండి..
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దసరా ఉత్సవాలలో కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎట్టువంటి ఇబ్బందులు లేకుండా లడ్డూలను విక్రయించిన విధంగానే భవాని భక్తులకు కూడా విక్రయించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు లడ్డు తయారి కేంద్రం అధికారులను ఆదేశించారు.
భవాని భక్తులకు లడ్డు విక్రయాలలో జరుగుతున్న జాప్యంపై పిర్యాధులు వచ్చిన నేపథ్యంలో కనకదుర్గా నగరంలోని ఏర్పాటు చేసిన లడ్డు విక్రయ కేంద్రాలను సమీపంలోగల లడ్డూ తయారి కేంద్రాలను గురువారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ఆకస్మిక తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ దసరా నవరాత్రి ఉత్సవాలకు తరలివచ్చిన లక్షలాధిమంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా లడ్డు విక్రయాలు నిర్వహించడం జరిగిందన్నారు. మూల నక్షత్రం రోజున మరియు విజయదశమి రోజున లక్షలాది మంది భక్తులకు విక్రయించేందుకు లడ్డూలను సిద్దం చేసి విక్రయించిన తీరును అభినందిస్తున్నానన్నారు. అలాగే గురు శుక్ర వారాలలో రాష్ట్ర నలుమూలతో పాటు ఇతర రాష్ట్రల నుండి వేలాధిగా భవాని భక్తులు తరలివస్తున్నారన్నారు. భవాని భక్తులు కోరినన్ని లడ్డులు విక్రయించాల్సిన భాధ్యత అధికారులపై ఉందన్నారు. బుధవారం విజయదశమి రోజున 3 లక్షల లడ్డులు అవసరమవుతుందని అంచనా వేశామని అయితే ఒకే రోజు ఐదు లక్షల లడ్డులను విక్రయించడం వలన స్టాకు లేకపోవడం వలన భవాని భక్తులకు లడ్డూలు అందించడంలో కొంత జాప్యం ఏర్పడిరదని లడ్డు పోటు అధికారులు జిల్లా కలెక్టర్‌కు వివరించారు. లడ్డు తయారి కేంద్రలలో మరింత మంది సిబ్బందిని నియమించి లడ్డూల తయారిలో జాప్యాన్ని నివారించాలన్నారు. తయారి అయిన లడ్డుల ప్యాకింగ్ విక్రయ కేంద్రాలకు తరలించడం వంటి విషయాలపై ప్రత్యేక శ్రద్ద పెట్టి భక్తులకు అమ్మవారి లడ్డు ప్రసాదాన్ని అందించేందుకు కృషి చేయాలన్నారు.
లడ్డు పోటు పరిశీలలో జిల్లా కలెక్టర్ వెంట దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ యంకెటిఎన్‌వి ప్రసాద్, దుర్గ గుడి ఏఇవో ఎన్ రమేష్, లడ్డు పోటు సిబ్బంది తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News