-సిసిఎల్ఎ అధికారులతో కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో భూముల రీసర్వే వేగవంతంగా జరుగుతుందని ఇప్పటికే 14గ్రామాలలో 13 వ నోటిఫికేషన్ తో సర్వే ప్రక్రియ పూర్తీ చేశామని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు సిసిఎల్ఎ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ కు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షా పథకం పనుల్లో బాగంగా భూరికార్డుల స్వచ్చీకరణ, సమగ్ర భూముల రీసర్వే ప్రక్రియపై సిసిఎల్ఎ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ గురువారం జిల్లా కలెక్టర్ లు, జాయింట్ కలెక్టర్ లు సర్వే అధికారులతో ఆయన కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న రీసర్వే ప్రక్రియ ప్రస్తుత ప్రగతిని నగరంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి కలెక్టర్ ఢిల్లీరావు సిసిఎల్ఎ కు వివరించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విస్సన్నపేట, గంపలగూడెం ,తిరువూరు, ఏ కొండూరు ,రెడ్డిగూడెం, జగ్గయ్యపేట, కంచికచర్ల, వత్సవాయి మండలాలలోని 136 గ్రామాలలో భూ సర్వే నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో చివరి విడత అయిన 13 వ నోటిఫికేషన్ తో 14 గ్రామాలలో రీ సర్వే పూర్తి చేశామని అన్నారు. జగ్గయ్యపేట మండలం షేర్ మహ్మద్ పేట, కంచికచర్ల మండలం పరిటాల, ఎ కొండూరు మండలం వామకుంట్ల, తిరువూరు మండలంలో మారేపల్లి, ఆంజనేయపురం, ముష్టికుంట్ల, చిట్యాల గ్రామాలు, విస్సన్నపేట మండలం చండ్రుపట్ల గ్రామం, గంపలగూడెం మండలం లో గంపలగూడెం,రాజవరం, చెన్నవరం , అనుమోలంక, కనుమూరు,వినగడప గ్రామాలలో 13 వ నోటిఫికేషన్ తో రీసర్వే పూర్తి చేశామని తెలిపారు. 41గ్రామాల్లో డ్రోన్ ఫ్లయింగ్, 14 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్, మరో 14 గ్రామాల్లో గ్రౌండ్ వాలిదేషన్ పూర్తి చేసామని కలెక్టర్ ఢిల్లీ రావు సిసిఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్, ఉన్నారు.
Prajavartha Online Telugu News