విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ శుక్రవారం ఉప రాష్ట్రపతితో సమావేశమై విభిన్న అంశాలపై సమాలోచన జరిపారు. సమకాలీన అంశాలపై చర్చించారు. గవర్నర్ తో పాటు రాజ్ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్ పి సిసోడియా, ఇతర అధికారులు ఉన్నారు. శనివారం గవర్నర్ హరి చందన్ విజయవాడ రాజ్ భవన్ కు చేరుకుంటారు.
Prajavartha Online Telugu News