Breaking News

జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక గ్రీవెన్సు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన అర్జీలు పునరావృతం కాకుండా తొలి దశలోనే నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు అధికారులను కోరారు. స్పందనలో పునరావృతమవుతున్న ఆర్జీలకు సంబంధించిన అర్జీదారులు, అధికారులతో కలెక్టర్ డిల్లీరావు నగరంలోని ఆయన కార్యాలయం నుండి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక గ్రీవెన్సునిర్వహించారు. పునరావృతమవుతున్న (రీ ఒపెన్) ఆర్జీల సమస్యలపై ఆర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ప్రజా సమస్యలను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పునరావృతమవుతున్న (రీఒపెన్) స్పందన ఆర్జీలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. ఆర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యతతో కూడిన పరిష్కారమార్గం చూపే విధంగా. సమస్య పరిష్కరించినప్పటికీ ఆర్జీదారుడుసంతృప్తి చెందక మరల స్పందనలో తిరిగి ఆర్జీని సమర్పిస్తున్నారన్నారు. ఇటువంటి ఆర్జీలను గుర్తించి ఎందుకుఆర్జీదారుడు సంతృప్తి చెందలేకపోతున్నాడనే దానిపై ఆర్జీదారులు, సంబంధిత అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి కారణాలను పూర్తిస్థాయిలోచర్చిస్తున్నామన్నారు. సమస్యలనుపరిష్కరంచటంలో అధికారుల లోపమున్నట్లయితే వాటిని సరిదిద్ది ఆర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ప్రత్యేక గ్రీవెన్స్ ద్వారా స్పందనలోని ప్రతీ సమస్యకు ముఖ్యంగా పునరావృతం అవుతున్న అర్జీలకు స్పష్టమైన పరిష్కారం ఇవ్వాలనదే తమ లక్ష్యమన్నారు. ఆర్జీలను మరింతనిశితంగా పరిశీలించి వారి పరిధిలోనే సమస్యలను నాణ్యతతో కూడిన పరిష్కారాన్ని ఆర్జీదారునికి చూపించగలుగుతారన్నారు. ప్రత్యేక గ్రీవెన్స్ ద్వారా స్పందనలోపునరావృతమవుతున్న (రీ ఒపెన్) 4 ఆర్జీలకు సంబంధించి ఆర్జీదారులు సంబంధిత అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఆర్జీలకు పరిష్కారం చూపారు.

పరిష్కరించిన ప్రధాన అర్జీలు…
విజయవాడ రూరల్ రామవరప్పాడు కు చెందిన ఎస్ కృష్ణ బాబు కు చెందిన డిసాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన అర్జీ
విజయవాడ గుణదలకు చెందిన వి శోభారాణి కు చెందిన రెవెన్యూ పరమైన సమస్య..
వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామానికి చెందిన కె వెంకటలక్ష్మి నరసింహ సత్యసాయి బాబు కు చెందిన రెవెన్యూ సంబంధించిన అర్జీ..
కంచికచర్ల మండలం కునికినపాడు గ్రామానికి చెందిన సిహెచ్ దుర్గ భవాని కు చెందిన రెవిన్యూకు సంబంధించిన అర్జీలకు జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు పరిష్కారం చూపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *