Breaking News

కేంద్ర ప్రభుత్వం తరపున పూర్తి స్థాయి లో ఆదుకోవడానికి అనువుగా చర్యలు తీసుకుంటాం…

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త :
జూలై, ఆగస్ట్ నెలల్లో సంభవించిన అకాల వర్షాలు కారణంగా దెబ్బతిన్న వాటికి సంబంధించి నిధులు కోరే విషయంలో తాత్కాలిక, దీర్ఘకాలిక లక్ష్యాల తో కూడి సమగ్ర నివేదికను సమర్పించాలని, కేంద్ర ప్రభుత్వం తరపున పూర్తి స్థాయి లో ఆదుకోవడానికి అనువుగా చర్యలు తీసుకుంటామని ఎన్ ఐ డి ఎమ్ ప్రొఫెసర్ సంతోష్ కుమార్ పేర్కొన్నారు.

సోమవారం ఎన్ ఐ డి ఎమ్ ప్రొఫెసర్ డా. సంతోష్ కుమార్, ఎన్డిఎమ్ఏ జూనియర్ కన్సల్టెంట్ జావేద్ ఇక్బాల్, మెడికల్ ఆఫీసర్ అవనిత్ రంధవా లతో కూడిన న్యూ ఢిల్లీ నుంచి కేంద్ర బృందం స్థానిక ప్రవేటు సమావేశ మందిరంలో ఐదు జిల్లాల పరిధిలో జరిగిన రూ.476.46 కోట్ల నష్టం అంచనాపై రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్ డి అంబేడ్కర్ ఆధ్వర్యంలో సమగ్రంగా అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా ఎన్ ఐ డి ఎమ్ ప్రొఫెసర్ డా. సంతోష్ కుమార్ మాట్లాడుతూ, తూర్పు, పశ్చిమ, ఏలూరు, డా బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల పరిధిలో జూలై, ఆగస్ట్ నెలలో వివిధ శాఖలకు చెందిన నష్టాలు పై జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ మరియు ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో బృందం విపత్తు తర్వాత పునరుద్ధరణ మరియు పునర్నిర్మాణ ప్రణాళిక పై  నివేదిక రూపొందించడం జరిగిందన్నారు. ఆ నివేదికలపై క్షేత్ర స్థాయి లో పర్యటించే ముందు ఆయా బృందాల్లో పనిచేసిన నిపుణులతో సమీక్ష నిర్వహించామన్నారు. వారు పేర్కొన్న అంశాల మరింతగా విశ్లేషణ చేసే దిశలో మొత్తం వివరాలు, ప్రస్తుతం వాటిల్లిన నష్టం, తాత్కాలిక పునరుద్దరణ, శాశ్వత పరిష్కారం తదితర అంశాల వారీగా విడివిడిగా నివేదికలను అందచేయాలని ఆదేశించారు. ఉదయం సమావేశంలో ప్రాథమిక అంశాల వారీగా సమీక్ష చేసిన బృందం సాయంత్రం తిరిగి సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. మంగళవారం కోనసీమ జిల్లాలో పర్యటన చేసి వాస్తవిక పరిస్థితి పై పరిశీలన చేస్తామని అన్నారు. ఈ పర్యటన అనంతరం విజయవాడ లో ముందస్తు నివేదిక, అధ్యయన బృందం సిఫార్సులు, క్షేత్ర స్థాయి సందర్శన క్రోడీకరించి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా సమీక్ష లో భాగంగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా . బి ఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా జూలై 9 నుంచి 23 వరకు, తిరిగి ఆగస్ట్ నెలలో 10 నుంచి 21 వరకు వరుసగా రెండుసార్లు అధిక వర్షాలు, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా వర్షాలు కురిసి నందున, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఐదు జిల్లాలో ఉన్న ప్రాంతాలు వరదలకు, ముంపునకు గురి అయినట్లు వివరించారు. గృహాలు,(పక్కా గృహాలు, తాటాకు ఇల్లు తదితర) ఆర్ అండ్ బి, పి ఆర్, త్రాగునీటి వ్యవస్థ, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, విద్యుత్, ఇరిగేషన్ , ఆరోగ్యం తదితర శాఖల కు చెందిన మౌలిక సదుపాయాలు, వసతుల కు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. పునరావాసం కింద ప్రతి ముంపు ప్రాంతాల కుటుంబానికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందచేశామన్నారు. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థఎగ్జిక్యూటివ్ తరపున అందించే రూ.,5 వేల ఆర్థిక సహాయానికి అందనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో ఐదు వేలు చొప్పున ఇవ్వడం జరిగిందని, ఈ నిర్ణయం మా రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్నట్లు అంబేద్కర్ వివరించారు. ఆర్ అండ్ బి కి చెందిన 179 కి. మి. మేర రహదారుల కోసం రూ.48 కోట్లతో అంచనాతో నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ అంశం పై సంతోష్ కుమార్ స్పందిస్తూ శాశ్వత ప్రాతిపదికన అయ్యే ఖర్చు తో ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు. ఇండ్ల కు సంబందించి 32,242 ఇళ్లకు రూ.187.16 కోట్లు , పంచాయతీ రాజ్ కి సంబందించిన 261 పనులకు చెంది 403 కి. మీ. కోసం 182.13 కోట్లు, ఆర్డబ్ల్యూఎస్ కి సంబంధించి త్రాగునీటి, శానిటేషన్ కోసం రూ.87.98 లక్షలు కు, రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్ కి చెంది రహదారులు కోసం , రూ.4.72 కోట్లతో, డ్రైయిన్స్ కోసం రూ.12.34 కోట్లు, త్రాగునీటి వ్యవస్థ కోసం కోటి రూపాయలు మేర ప్రతిపాదనలు అధికారులు ఇవ్వడం జరిగింది. స్కూల్స్ కి సంబంధించి 104 స్కూల్స్ కి రూ.138 లక్ష లతో నివేదిక అందచేశారు. 84 అంగన్వాడి కేంద్రాలకు రూ.7.79 కోట్లు, ఆసుపత్రి లకు చెంది 13 పనుల కోసం రూ.31.68 కోట్ల తో ముసాయిదా ప్రతిపాదనలు అందచేశారు. వీటిపై చర్చించిన బృందం పూర్తి స్థాయిలో అంచనా వేసిన నివేదిక ఇవ్వాలని, భవిష్యత్తు లో ఇటువంటి ఉపద్రవం ఎదురైన వాటిని అధిగమించడం దిశగా అడుగులు వేస్తూ నివేదిక అందజేయ్యాలన్నారు.
.

ఏ. పి. ఎస్. డి. యం. ఎ., ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ సి. నాగరాజు, జిల్లా డిజాస్టర్ మేనేజర్  కిరణ్మయి, ఎస్. సి, పిఆర్ & గ్రామీణ నీటి సరఫరా  బి.హరే రామ్ నాయక్, ఈ. ఈ.,సమగ్ర శిక్ష , విద్య విభాగం,డి.నరసింహా రావు, మహిళ, శిశు సంక్షేమ శాఖ ఎ. డి. ఏ.విజయ,రో డ్లు మరియు భవనాల శాఖ ఎస్ ఈ కె శ్రీనివాస్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు గృహ నిర్మాణ శాఖ యం. సురేష్ కుమార్, డి హెచ్ వో బి. తారాచంద్, ఎ. పి. యం. ఎస్ ఐ. డి. సి. ఎగ్జిక్యూ టివ్ ఇంజనీర్, బి. శ్రీధర్ ప్రసా ద్, ఆర్. డబ్ల్యూ. ఎస్, ఎస్. ఈ., బాలశంకర్ రావు, పి ఆర్ ఎస్ ఈ ఏ బి వి ప్రసాద్, ఎస్. ఈ, హౌసింగ్ ఎస్. నాగభూషణం, ఈ. ఈ. పంచాయతీ రాజ్ రమణ, ఆర్ అండ్ బి డి ఈ – ఎస్ బి వి రెడ్డి, డి. ఈ. ఈ., ఆర్ డబ్ల్యూ. ఎస్. మహేష్, ఈ. ఈ., పురపాలక శాఖ, ఆర్. ఎ. శేషగిరి రావు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *