Breaking News

విజయవాడ పశ్చిమంలో తలైవి…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తలైవి…అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది తమిళనాట రాజకీయ సంచలనం జయలలిత. కానీ ఇప్పుడు ఈ పేరు విజయవాడలో మారు మోగిపోతోంది. ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో…అవును …ఎవరనుకుంటున్నారా? వైఎస్సార్‌సీపీ అమ్ముల పొదిలో ఓ అస్త్రం. యంగ్‌ అండ్‌ డైనమిక్‌ లీడర్‌ 42వ డివిజన్‌ కార్పొరేటర్‌ పడిగపాటి చైతన్యరెడ్డి. రాజకీయాల్లో అడుగుపెట్టడమే సంచలనాలు నమోదు చేసింది. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే 40 ఏళ్ల టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టింది. గతంలో ఎవరికీ సాధ్యంకాని రికార్డు నెలకొల్పింది. బీటెక్‌ చదివింది. సాఫ్ట్‌గా ఉంటుంది అనుకున్న వాళ్లకు శివాలెత్తించింది. భవానీపురం అంటే టీడీపీ కంచుకోట అనుకునేవాళ్లంతా అవాక్కయ్యేలా చేసింది. సంధించిన బాణంలా దూసుకుపోతోంది. వైఎస్సార్‌సీపీకి పెట్టని కోటలా ఉన్న సోషల్‌మీడియా ఎన్టీఆర్‌ జిల్లా బాధ్యతలు చేపట్టింది. ప్రత్యుర్థుల పోస్టులకు కౌంటర్లు వేస్తూ ఫైర్‌బ్రాండ్‌గా మారింది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ డివిజన్‌ అభివృద్ధిచేసుకుంటూ అటు డివిజన్‌ ప్రజల అభిమానాన్ని చూరగొంటూ అందరి మన్ననలు పొందుతున్న యువ నాయకురాలు. ఇటువంటి నాయకురాలు మరింత ఉన్నత స్థితిలోకి వెళితే ప్రజలకు మరింత సేవచేస్తుందనే ఆలోచనలో ప్రజలు వున్నట్లు వారి మాటల్లోనే తెలుసుకోవచ్చు. రాజకీయాల్లో ఎప్పుడు వచ్చామో కాదో ప్రజలకు ఏమి చేసామో చేసి చూపిస్తున్న అధినాయకుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అడుగుజాడల్లో నడుస్తున్న మహిళా రత్నం పడిగపాటి చైతన్యరెడ్డి. మోడల్‌ డివిజన్‌గా అన్ని విధాలా తీర్చిదిద్దుతూ గ్రీనరీకి ప్రాధాన్యత ఇస్తూ పార్కులు, రోడ్లు మరమ్మత్తులు, మౌలిక సదుపాయాల ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషిస్తున్న పాత్రధారి. డివిజన్‌లో ప్రజలకు ఏమి కావాలో తన దగ్గరకు వచ్చి అడగకుండానే వారికి ఏమికావాలో ముందుగానే గ్రహించి వారికి ఏర్పాటు చేసి వారి సమస్యలను సత్వరం తీర్చే మనసున్న మానవతామూర్తి పడిగపాటి చైతన్యరెడ్డి. తల్లో నాలుకగా మారిన తలైవి పొలిటిక్స్‌లో ఫైర్‌ చూపే ఫైర్‌ బ్రాండ్‌. పై ప్రత్యేక కథనం.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *