విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సర్కిల్-2 ఏరియా లో మంగళవారం మేజిస్ట్రేట్ వారి ఆధ్వర్యలో (U. రామ మోహన్రావు), జోనల్ కమిషనర్ – 2 కార్యాలయం నందు సర్కిల్-2 కు సంబందించిన శానిటరీ ఇన్స్పెక్టర్లు మొత్తం 28 STC case లు పెట్టినారు వారి నుండి మొత్తం 10,360 రూపాయలు అపరాధ రుసుము కింద వసూలు చేశారు. వీటిలో ట్రేడ్ లైసెన్స్ లేనివారికి ,పశువులు,ఆవులు రోడ్ల పైన కట్టి మలేరియ మధ్యలో కట్టిన వారికి మరియు రోడ్ల పైన చెత్త వేసిన వారికి ఫైన్స్ విధించారు మరియు వారికి రోడ్ల పైన కాలువలో చెత్త వేయుట వలన ప్రజలకు ఇబ్బందులు అని చెప్పి ఇంకోసారి ఈ విధంగా మరొక సారి చేసినచో మరియు లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసినచట్ట ప్రకారం చర్యలు వుంటాయని చెప్పారు. అదే విధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణపై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాలను అమలుచేయవలసిన భాద్యత మనందరిపై ఉందని అన్నారు. ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చేందుకు శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు, శానిటరీ సెక్రెటరీలు, కూడా ప్రతిరోజు ఆయా డివిజన్లలో ప్లాస్టిక్ అమ్మే షాపులను తనిఖీ చేసి అందరు విధిగా ప్లాస్టిక్ బ్యాన్ అమలుచేయవలసినదిగా అదేశిచినారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్, హెల్త్ ఆఫీసర్లు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు, శానిటరీ సెక్రెటరీలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News